కాకినాడ నడిరోడ్డుపై ఘోరం... కొబ్బరి బోండాల కత్తితో వెహికల్ ఇన్స్ పెక్టర్ పై దాడి (వీడియో)

Published : Mar 17, 2023, 10:45 AM ISTUpdated : Mar 17, 2023, 11:22 AM IST
కాకినాడ నడిరోడ్డుపై ఘోరం... కొబ్బరి బోండాల కత్తితో వెహికల్ ఇన్స్ పెక్టర్ పై దాడి (వీడియో)

సారాంశం

కాకినాడలో దారుణం చోటు చేసుకుంది.  వాహనాల  తనఖిల్లో  డాక్యుమెంట్లు అడిగిన  ఎంవీఐపై   వాహన డ్రైవర్ కత్తితో దాడికి దిగాడు.ఈ ఘటనలో  ఎంవీఐ తీవ్రంగా గాయపడ్డారు.   

కాకినాడ:  రవాణా శాఖ అధికారి చెన్నారావుపై ఇవాళ (శుక్రవారం) వ్యాన్ డ్రైవర్ కత్తితో దాడికి దిగడంతో  తీవ్రంగా  గాయపడ్డారు. ఈ ఘటన  కాకినాడ  జిల్లాలో  జరిగింది. అసిస్టెంట్  ఎంవీఐ  చెన్నారావుపై కొబ్బరి  బొండాల  వ్యాన్ డ్రైవర్  వెంకట దుర్గాప్రసాద్  దాడికి దిగాడు.

వాహనాల తనిఖీల్లో భాగంగా  కొబ్బరి బొండాలు తరలిస్తున్న వ్యాన్ డాక్యుమెంట్లను  అసిస్టెంట్  ఎంవీఐ  చెన్నారావు అడిగాడు.ఈ విషయమై అసిస్టెంట్  ఎంవీఐతో  వ్యాన్ డ్రైవర్  వెంకట దుర్గాప్రసాద్  వాగ్వాదానికి దిగాడు . కొబ్బరి బొండాల కత్తితో  అసిస్టెంట్  ఎంవీఐ  చెన్నారావుపై  దాడికి దిగాడు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే వెంకట దుర్గాప్రసాద్  ఈ దాడికి దిగాడు.

వీడియో

ఈ ఘటనలో  అసిస్టెంట్  ఎంవీఐ చెన్నారావు శరీరంపై పలు చోట్ల గాయాలయ్యాయి.  చేతివేళ్లు తెగిపోయాయి.  ఈ దాడిని  అడ్డుకొనేందుకు ఎంవీఐ  వాహనం డ్రైవర్ వీరబాబు ప్రయత్నించారు. వీరబాబు  కూడా ఈ ఘటనలో  గాయపడ్డారు. ఈ విషయం తెలిసిన వెంటనే  పోలీసులు సంఘటన స్థలానికి  చేరుకున్నారు.  అసిస్టెంట్  ఎంవీఐ చెన్నారావును ఆసుపత్రికి తరలించారు. చెన్నారావు  పరిస్థితి విషమంగా  ఉందని సమాచారం.  అసిస్టెంట్  ఎంవీఐపై  దాడికి దిగిన  వెంకట దుర్గాప్రసాద్  ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

బాబుకు కొత్త బిరుదు ఇచ్చిన నిమ్మల | Nimmala Ramanaidu Speech | Asianet Telugu
Nara Lokesh VS Varma | CM Chandrababu Naidu | Asianet Telugu