కర్నూలులో జంట హత్యల కలకలం.. అక్రమ సంబంధమే కారణం?

Published : Sep 25, 2021, 12:03 PM ISTUpdated : Sep 25, 2021, 12:11 PM IST
కర్నూలులో జంట హత్యల కలకలం.. అక్రమ సంబంధమే కారణం?

సారాంశం

కాగా ఈ జంట హత్యలకు వివాహేతర సంబంధమే కారణమని తెలస్తోంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

కర్నూలు : కర్నూలు జిల్లా(Kurnool)లో దారుణం జరిగింది. వెలుగోడు సీపీనగర్ లో జంట హత్యలు (Double Murder)కలకలం రేపుతున్నాయి. వెలుగోడులో చిన్ని, ఓబులేసు అనే ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. చిన్ని, ఓబులేసులను దుండగులు నరికి చంపారు అనంతరం నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

కాగా ఈ జంట హత్యలకు వివాహేతర సంబంధమే కారణమని తెలస్తోంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సిద్దాపురం గ్రామానికి చెందిన మల్లికార్జునకు ఇద్దరు భార్యలు. వెలుగోడులో నివాసం ఉంటున్నారు. మల్లికార్జున దగ్గర ఓబులేసు అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. 

ఓబులేసు కూడా మల్లికార్జునతో అతని ఇంట్లోనే ఉండేవాడు. అయితే, ఈ క్రమంలోనే అర్థరాత్రి ఓబులేసు, మల్లికార్జున రెండో భార్య చిన్నిలను కిరాతకంగా హత్య చేశారు. మల్లికార్జున తండ్రి ఈ హత్యలకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మల్లికార్జున తండ్రిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

హత్యలకు అక్రమ సంబంధమే కారణం అయి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు మృతదేహాలను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 

PREV
click me!

Recommended Stories

Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu
CM Chandrababu at Naravaripalli నారావారి పల్లి లో గోమాతకి పూజ చేసిన సీఎం చంద్రబాబు| Asianet Telugu