మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది.తనపై ఇటీవల నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయ్యన్నపాత్రుడిపై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది.
అమరావతి: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి (Ayyanna patrudu)ఏపీ హైకోర్టులో (ap high court) శుక్రవారం నాడు ఊరట లభించింది.అయ్యన్నపాత్రుడిపై చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది.తనపై ఇటీవల నమోదైన కేసులను (case) కొట్టివేయాలని కోరుతూ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.
గత మాసంలో మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు (kodela siva prasada rao )వర్ధంతి సభలో ప్రసంగిస్తూ ఏపీ సీఎం జగన్ పై (Ys jagan) అనుచిత వ్యాఖ్యలు చేశారని అయ్యన్నపాత్రుడిపై వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఈ ఫిర్యాదు ఆధారంగా అయ్యన్నపాత్రుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
సెక్షన్ 188, కోవిడ్ నిబంధనల ఉల్లంఘన, సెక్షన్ 270 సెక్షన్ 504,సెక్షన్ 505(2),సెక్షన్ 509, 51(బీ), డీఎంఏ 2005 విపత్తుల నిర్వహణ మార్గదర్శకాల ఉల్లంఘనతో .పాటు ఎస్సీ, ఎస్టీ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులపై ఏపీ హైకోర్టులో అయ్యన్నపాత్రుడు పిటిషన్ దాఖలు చేశారు. అయ్యన్నపాత్రుడిపై చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.