మామ గంగిరెడ్డి వర్ధంతి... రేపు కడప జిల్లాకు సీఎం జగన్ దంపతులు

By Arun Kumar PFirst Published Oct 1, 2021, 2:46 PM IST
Highlights

మామ గంగిరెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ అక్టోబర్ 2,3 తేదీల్లో కడప జిల్లాలో పర్యటించనున్నారు. 

కడప: అక్టోబర్ 2, 3 తేదీల్లో ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడపలో పర్యటించనున్నారు. ఈ నెల 3వ తేదీన తన మామ ఈసీ గంగిరెడ్డి(వైఎస్ భారతి తండ్రి) ప్రథమ వర్ధంతిని కార్యక్రమంలో పాల్గొనేందుకు  జగన్ కడపకు వెళుతున్నారు. సతీసమేతంగా శనివారం ఇడుపులపాయ ఎస్టేట్ లో బసచేయనున్న సీఎం ఆదివారం గంగిరెడ్డి వర్థంతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇలా జగన్‌ రెండు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. 

అక్టోబర్‌ 2వ తేదీ మధ్యాహ్నం తాడేపల్లి నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు సీఎం జగన్ కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 4.20 గంటలకు ఇడుపులపాయలోని హెలిప్యాడ్‌ వద్ద స్థానిక నాయకులతో కొద్దిసేపు మాట్లాడతారు. అనంతరం వైఎస్సార్‌ ఎస్టేట్‌కు చేరుకోనున్న సీఎం జగన్ రాత్రికి అక్కడే బస చేస్తారు.

ఇక అక్టోబర్ 3వ తేదీ ఆదివారం మామ గంగిరెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉదయం 10గంటలకు పులివెందులలోని లయోలా డిగ్రీ కాలేజీ రోడ్డులో ఉన్న సమాధి వద్దకు చేరుకోనున్న సీఎం జగన్, ఆయన సతీమణి భారతి నివాళి అర్పిస్తారు. 10.30కి భాకరాపురంలోని ఆడిటోరియంలో జరిగే ప్రార్థనల్లో దంపతులిద్దరు పాల్గొంటారు. ఆ తర్వాత 11.40 గంటలకు భాకరాపురంలోని అత్తవారింటికి వెళ్ళనున్నారు సీఎం జగన్.

మామ గంగిరెడ్డ వర్ధంతి కార్యక్రమాలన్ని ముగిసిన తర్వాత మధ్యాహ్నం 12.40కి  రోడ్డుమార్గంలో కడప ఎయిర్‌పోర్టుకు చేరుకోున్నారు. అక్కడినుండి బయలుదేరి 1.30కి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన మధ్యాహ్నం 2కి తాడేపల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు సీఎం జగన్.
 

click me!