‘నా చేతి మీదున్న భార్య పేరు తీసేసి.. దహనం చేయండి’.. ఆత్మహత్య చేసుకునేముందు యువకుడి సెల్ఫీ వీడియో..

Published : Oct 01, 2021, 03:14 PM IST
‘నా చేతి మీదున్న భార్య పేరు తీసేసి.. దహనం చేయండి’.. ఆత్మహత్య చేసుకునేముందు యువకుడి సెల్ఫీ వీడియో..

సారాంశం

నాలుగేళ్ల క్రితం తెలంగాణ రాష్టం రాచేపల్లికి చెందిన కృష్ణవేణితో అతనికి వివాహం అయ్యింది. కొన్నేళ్ల పాటు సజావుగానే ుణ్నా ఇటీవల ఆమె మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తి ఘర్షణలు జరుగుతున్నాయి.

జగ్గయ్యపేట్ : కట్టుకున్న భార్య ప్రవర్తన నచ్చక ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య(Suicide)కు పాల్పడిన ఘటన పట్టణంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.  మండలంలోని మిట్టగూడెంనకు చెందిన ఆళ్ల వెంకటేశ్వరరావు (25) బైక్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. 

నాలుగేళ్ల క్రితం తెలంగాణ రాష్టం రాచేపల్లికి చెందిన కృష్ణవేణితో అతనికి వివాహం అయ్యింది. కొన్నేళ్ల పాటు సజావుగానే ుణ్నా ఇటీవల ఆమె మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తి ఘర్షణలు జరుగుతున్నాయి. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లి అక్కడే భర్త మీద కేసు పెట్టింది. అయితే పెద్దలు రాజీ చేసి ఆమెను కాపురానికి పంపించారు. 

రెండు రోజుల క్రితం భార్య మళ్లీ పుట్టింటికి వెళ్లింది. అయితే ఆమె ప్రవర్తన నచ్చక రాత్రి తొమ్మిది గంటల సమయంలో తాను పనిచేస్తున్న షెడ్డులోనే వెంకటేశ్వరరావు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు అతను కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. 

విశాఖలో విద్యార్థుల మధ్య ఘర్షణ: ఏడో తరగతి విద్యార్థి జశ్వంత్ మృతి

‘అమ్మా నన్ను క్షమించు. ఇక నీతో మాట్లాడలేనమ్మా. ఇవే నా ఆఖరి మాటలమ్మా. నేనున చచ్చిపోతున్నాను. మీరు నా గురించి ఆగం కావద్దు. ఇద్దరు తమ్ముళ్లను మంచిగా చూసుకుంటూ ఆనందంగా ఉండండమ్మా. మీరు సంతోషంగా ఉంటే చాలమ్మా. 

నా జీవితంలో కష్టం తప్ప ఏ నాడూ సుఖపడలేడమ్మా. మీ అందరినీ వదిలిపెట్టి పోవాలని లేదు. అన్ని విధాలా మోసపోయాను. నేను చేనిపోయిన తరువాత కృష్ణవేణి వస్తే నా శవాన్ని ముట్టుకోనివ్వద్దు. నా చేతి మీద ఆమె పేరు ఉంది. దానిని తీసేసి దహన సంస్కారాలు చేయండి’ అని కన్నీటి పర్యంతమై ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. మృతుడి తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు ఎస్ఐ-2 రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu