భర్త వదిలేసిన మహిళ తో ఎఫైర్.. ఆమె కూతురిపైనా కన్నేసి..!

Published : Jul 01, 2021, 07:46 AM IST
భర్త వదిలేసిన మహిళ తో ఎఫైర్.. ఆమె కూతురిపైనా కన్నేసి..!

సారాంశం

ఆమె కూతురిపై కూడా కన్నేశాడు. ఆమె కూతురిని తనకిచ్చి పెళ్లి   చేయాలంటూ వేధించడం మొదలుపెట్టాడు. అతని వేధింపులు తట్టుకోలేక బాధితులు పోలీసులను ఆశ్రయించారు. 

భర్త వదిలేసిన మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత.. ఆమె కూతురిపై కూడా కన్నేశాడు. ఆమె కూతురిని తనకిచ్చి పెళ్లి   చేయాలంటూ వేధించడం మొదలుపెట్టాడు. అతని వేధింపులు తట్టుకోలేక బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటన మంగళగిరిలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మంగళగిరికి చెందిన గోలి సాంబశివరావు కొన్నేళ్లుగా భర్త వదిలేసిన మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఆ మహిళకు ఒక కుమార్తె ఉండగా.. తల్లితోనే ఉంటోంది. డిగ్రీ చదువుతున్న ఆ యువతికి పెళ్లి చేసేందుకు తల్లి ప్రయత్నాలు చేస్తుండగా.. 


ఆమెపైనా కన్నేసిన సాంబశివరావు అడ్డుకుంటున్నాడు. చిన్నతనం నుంచీ తన తల్లితో ఉంటున్న సాంబశివరావును ఆ యువతి తండ్రిగానే పిలుస్తోంది. తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి తనను కూడా పెళ్లి చేసుకుంటాననడంతో ఆ యువతి తట్టుకోలేక ఎదురుతిరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన సాంబశివరావు తల్లీ కుమార్తెలను వారం రోజులుగా ఇంట్లోనే ఉంచి చిత్రహింసలు పెట్టాడు. బుధవారం ఆ యువతిని బెల్ట్‌తో చితకబాదడంతో తట్టుకోలేకపోయిన తల్లీ కుమార్తెలు ఇంటి నుంచి బయటపడి పోలీసులను ఆశ్రయించారు.   

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్