శ్రీకాకుళంలో అమానవీయ ఘటన: ఇద్దరు మహిళలపై ట్రాక్టర్ తో కంకర పోసిన దుండగులు

Published : Nov 07, 2022, 08:54 PM IST
 శ్రీకాకుళంలో అమానవీయ ఘటన: ఇద్దరు మహిళలపై ట్రాక్టర్ తో కంకర  పోసిన  దుండగులు

సారాంశం

శ్రీకాకుళం  జిల్లాలోని మంధస మండలం హరిపురంలో  సోమవారంనాడు ఇద్దరు మహిళలపై కంకర పోశారు. స్థానికులు ఆ మహిళలను రక్షించారు. ఈ  విషయమై  పోలీసులు కేసు నమోదు  చేశారు. 

శ్రీకాకుళం:జిల్లాలోని మంథస మండలం హరిపురంలో సోమవారంనాడు ఇద్దరు మహిళలపై  కంకర పోశారు..కంకర కింద కూరుకుపోయిన  ఓ మహిళలను రక్షించారు.  ఈ  ఘటనకు సంబంధించి  పోలీసులకు  బాధితులు పిర్యాదు చేశారు.  ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

హరిపురం గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు సాలమ్మ, సావిత్రిలు  తమ భూమి కబ్జాకు గురౌతుందని గత  కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. ఈ విషయమై తమకు న్యాయం చేయాలని 2019 లో దీక్ష కూడా  చేశారు. ఈ అయితే ఈ భూమిని  ఆనందరావు, ప్రకాష్ రావుతో పాటు  రామారావు  ప్రయత్నిస్తున్నారని  మహిళలు ఆరోపిస్తున్నారు. తమ భూమిలో కంకర  పోయవద్దని ఈ మహిళలు ఇవాళ ఈ  స్థలం వద్దకు చేరకున్నారు. అయితే ఈ ట్రాక్టర్ల ద్వారా తెచ్చిన కంకరను మహిళలపై పోశారు. అయితే ఈ ఘటనలో  ఇద్దరు మహిళలు  కంకర  కుప్పలో  కూరుకుపోయారు..బాధితులు కేకలు వేయడంతో   స్థానికులు  వచ్చి వారిని రక్షించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Police Recruitment: కొలువుల జాతర.. 2050 పోలీస్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. నోటిఫికేషన్ ఫుల్ డిటైల్స్ ఇవే
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ముక్కోటి దేవతలకు ఆహ్వానం | Tirumala Srivari Brahmotsavam | Asianet