తాళ్లరేపు జూనియర్ కాలేజీ పనుల్లో జాప్యం:ఇంజనీర్ పై సస్పెన్షన్ కు కలెక్టర్ ఆదేశం

Published : Nov 07, 2022, 08:25 PM IST
తాళ్లరేపు జూనియర్  కాలేజీ పనుల్లో జాప్యం:ఇంజనీర్  పై  సస్పెన్షన్ కు  కలెక్టర్  ఆదేశం

సారాంశం

కాకినాడ జిల్లాలోని తాళ్లరేవు జూనియర్ కాలేజీ నిర్మాణ పనుల్లో అలసత్వంపై అసిస్టెంట్ ఇంజనీర్  ను  కాకినాడ కలెక్టర్ కృతికా శుక్లా సస్పెండ్ చేశారు. 

కాకినాడ:జిల్లాలోని తాళ్లరేవు జూనియర్ కాలేజీ  నిర్మాణ పనుల్లో అలసత్వంపై అసిస్టెంట్ ఇంజనీర్ ను సస్పెండ్ చేయాలని  సోమవారంనాడు కాకినాడ కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు.నాడు నేడు  పనులను  కాకినాడ కలెక్టర్  కృతికా  శుక్లా పరిశీలిస్తున్నారు.ఈ క్రమంలోనే తాళ్లరేవులోని జూనియర్  కాలేజీ  నిర్మాణ పనుల్లో  అలసత్వంపై  అసిస్టెంట్  ఇంజనీర్ ను సస్పెండ్  చేయాలని  ఆమె ఆదేశించారు.  ఇవాళ కాలేజీ నిర్మాణ పనులను కలెక్టర్  పరిశీలించారు. పనుల జాప్యంపై అక్కడే ఉన్నఅధికారులను  అడిగి తెలుసుకున్నారు. పనులు  ఎందుకు ఆలస్యమౌతుననాయని  ప్రశ్నించారు. అసిస్టెంట్ ఇంజనీర్  సరైన  సమాధానం  చెప్పలేకపోయారు. దీంతో  సస్పెండ్  చేయాలని  కలెక్టర్ ఆదేశించారు.

క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని  పరిశీలించాలని సీఎం జగన్ అధికారులను  ఆదేశించారు.  వార్డు,గ్రామ సచివాలయాలను సందర్శించాలని కూడ సీఎం జగన్ ఇటీవల  ఆదేశించారు.లక్ష్యాల నిర్ధేశనకు సంబంధించి క్షేత్రస్థాయిలో  పనుల పురోగతిని ఎప్పటికప్పుడు  సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని  సీఎం అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో  పనుల  పరిశీలనకు  వెళ్లిన  కలెక్టర్  కృతిక శుక్లా   పనుల  జాప్యాన్ని  గుర్తించారు.దీంతో అసిస్లెంట్  ఇంజనీర్ ను సస్పెండ్  చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్