dharmana prasada rao : రోడ్లు బాగాలేవని వైసీపీని వద్దనుకోవద్దని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. రోడ్ల వల్ల జీవన ప్రమాణాలు పెరుగుతాయా అని ఆయన ప్రశ్నించారు.
dharmana prasada rao : ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు బాగా లేవని వైసీపీని వద్దనుకోవద్దని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. రోడ్ల వల్ల జీవన ప్రమాణాలు పెరుగుతాయా అని చెప్పారు. సోమవారం అనకాపల్లిలోని అచ్యుతాపురంలో నిర్వహించిన సామాజిక సాధికార యాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. రోడ్లు బాగా లేవని వైసీపీని వద్దని అనుకోవద్దని చెప్పారు.
icc world cup 2023 : ప్రపంచకప్ ఫైనల్ లో భారత్ ఓటమి.. మనస్థాపంతో ఇద్దరు యువకుల ఆత్మహత్య..
ఆంధ్రప్రదేశ్ కు చెన్నై, కర్నూలు రాజధానులుగా ఉన్నాయని, అప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు అక్కడికి వెళ్లేందుకు దాదాపు రెండు రోజుల సమయం పట్టేదని మంత్రి ధర్మాన అన్నారు. విశాఖపట్నానికి రాజధానికి అవసరమయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పారు. రాజధాని వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతాయని తెలిపారు. భారత దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరెంటు, నిత్యవసర వస్తువుల ధరలు పెరిగాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లోనే తక్కువగా ధరలు ఉన్నాయని అన్నారు. ఇక్కడి కంటే ఏ రాష్ట్రంలో ధరలు తక్కువగా ఉన్నాయో చెప్పాలని తెలిపారు.