సీఎం జగన్ సూళ్లూరుపేట పర్యటన వాయిదా.. కారణమిదే..

Published : Nov 21, 2023, 10:17 AM ISTUpdated : Nov 21, 2023, 11:30 AM IST
సీఎం జగన్ సూళ్లూరుపేట పర్యటన వాయిదా.. కారణమిదే..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుపతి జిల్లా పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన చేసింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుపతి జిల్లా పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన చేసింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సీఎం జగన్.. ఈరోజు తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉంది. అక్కడ పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు.. బహిరంగ సభలో ప్రసంగించాల్సి ఉంది. ఇందుకోసం ఈరోజు ఉదయం 8.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి జగన్ బయలుదేరుతారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఏర్పాట్లు కూడా జరిగాయి.

అయితే తాజాగా సీఎం జగన్ తిరుపతి జిల్లా పర్యటన వాయిదా పడింది. భారీ వర్షం కారణంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఈ రోజు జరగాల్సిన సీఎం వైఎస్ జగన్ పర్యటన వాయిదా పడినట్టుగా ముఖ్యమంత్రి కార్యాలయం ఈరోజు ఉదయం వెల్లడించింది. 

ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా రాయదారు వద్ద మంబట్టు సెజ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొనాల్సి ఉంది. అక్కడి నుంచే సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయాల్సి ఉంది. అయితే వర్షాల కారణంగా ఆ కార్యక్రమాలన్నీ వాయిదా పడ్డాయి. సూళ్లూరుపేటలో ముఖ్యమంత్రి పర్యటన రీ షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్