ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ హైకోర్టులో ఊరట: 2 వారాల వరకు అరెస్ట్ చేయొద్దని ఉత్తర్వులు

By narsimha lodeFirst Published Jan 7, 2021, 5:12 PM IST
Highlights

ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ముందస్తు అరెస్ట్ ను నిలిపివేయాలని పిటిషన్ పై ఏపీ హైకోర్టు గురువారం నాడు  విచారించింది.
 

అమరావతి: ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ముందస్తు అరెస్ట్ ను నిలిపివేయాలని పిటిషన్ పై ఏపీ హైకోర్టు గురువారం నాడు  విచారించింది.

రాష్ట్ర ప్రభుత్వం తనను ముందస్తుగా అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఇటీవలనే ఐపీఎస్ అధికారుల సంఘానికి రాసిన లేఖలో ఆయన ప్రస్తావించిన విషయం తెలిసిందే. 

ఇదే విషయమై ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు రెండు వారాల పాటు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.

రాష్ట్రంలో వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటేసింది. ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించాడని  ఆయనపై వేటేశారు.ఈ విషయమై ఆయన హైకోర్టును  ఆశ్రయించారు.

హైకోర్టు ఏబీ వెంకటేశ్వరరావుపై విధించిన సస్పెెన్షన్ ను ఎత్తివేసింది. పోస్టింగ్ కూడా ఇవ్వాలని ఆదేశించింది. కానీ ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు.ఇదే విషయమై ఆయన ఐపీఎస్ అధికారుల సంఘానికి లేఖ రాశాడు.  ఈ లేఖలో తనపై తప్పుడు కేసులతో జైల్లో పెట్టే అవకాశం ఉందని పేర్కొన్నాడు. 
 

click me!