నగర, పట్టణ పేదలకు జగన్ మరో పథకం

Siva Kodati |  
Published : Jan 07, 2021, 03:41 PM IST
నగర, పట్టణ పేదలకు జగన్ మరో పథకం

సారాంశం

మధ్య తరగతి ప్రజలకు మరో పథకాన్ని అందుబాటులోకి తీసుకురాబోతోంది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రంలోని పట్టణ, నగర పేదలకు తక్కువ ధరకు ప్లాట్లు ఇవ్వనుంది. లే ఔట్లను అభివృద్ధి చేసి లాభాపేక్ష లేకుండా లాటరీ పద్ధతిలో కేటాయింపులు జరపనుంది

మధ్య తరగతి ప్రజలకు మరో పథకాన్ని అందుబాటులోకి తీసుకురాబోతోంది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రంలోని పట్టణ, నగర పేదలకు తక్కువ ధరకు ప్లాట్లు ఇవ్వనుంది.

లే ఔట్లను అభివృద్ధి చేసి లాభాపేక్ష లేకుండా లాటరీ పద్ధతిలో కేటాయింపులు జరపనుంది. మధ్యతరగతి వారికోసం ఏదైనా చేయాలన్న తపనతోనే ఈ ఆలోచన తీసుకున్నామని జగన్ స్పష్టం చేశారు.

మధ్యతరగతి ప్రజలకు క్లియర్‌ టైటిల్‌తో, వివాదాల్లేని ప్లాట్లు ఇస్తామని  ప్రకటించారు. పాట్లు అందజేయడంపై విధానాలు రూపొందించాలని అధికారులకు సీఎం జగన్‌ ఆదేశించారు. ఈ మేరకు గురువారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్భన్‌ డవలప్‌మెంట్‌ సెక్రటరీ వై శ్రీలక్ష్మి, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ విజయ్‌కుమార్‌ సహా పలువురు అధికారులు హాజరయ్యారు

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu