వాలంటీర్లకు ఎన్నికల విధులొద్దు,ప్లాన్ బీ ప్రస్తావన: ఎస్పీ, కలెక్టర్ల సమావేశంలో నిమ్మగడ్డ

By narsimha lodeFirst Published Jan 27, 2021, 1:09 PM IST
Highlights

స్థానిక సంస్థల ఎన్నికల్లో వాలంటీర్లకు ఎలాంటి బాధ్యతలు అప్పగించొద్దని ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సూచించారు.

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో వాలంటీర్లకు ఎలాంటి బాధ్యతలు అప్పగించొద్దని ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సూచించారు.

బుధవారం నాడు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో ఆయన పలు అంశాలపై అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ఎన్నికల విదులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఆయన కోరారు. 

ఎన్నికల ప్రక్రియను తొలి ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రక్రియ తర్వాతి స్థానంలో సంక్షేమాన్ని  చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఏకగ్రీవాలకూ కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అధికారులకు చెప్పారు.

గొడవలు, అసాంఘిక చర్యల సమాచారాన్ని పౌరులు కూడ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావొచ్చన్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రత్యేక యాప్ తీసుకొచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల ప్రక్రియకు ప్లాన్ బీ ని కూడ అవసరమైతే అమలు చేస్తామన్నారు. 

also read:పంచాయితీ ఎన్నికల నిర్వహణపై పరస్పరం సహకరించుకోవాలి: ఎస్ఈసీ, సీఎస్‌కి గవర్నర్ సూచన

ఎన్నికల బందోబస్తుకు కేంద్ర బలగాలను ఉపయోగించడమే ప్లాన్ బీ అని ఆయన ఈ సమావేశంలో ప్రస్తావించారు.  కాల్ సెంటర్ల ద్వారా ఫిర్యాదులు స్వీకరించాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు.ఎన్నికల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా ఎలాంటి ఉపయోగం లేదన్నారు. పోలింగ్ కేంద్రాల్లో కొద్ది ప్రాంతాన్నే రికార్డు చేస్తోందని ఆయన చెప్పారు.

వెబ్ కాస్టింగ్ లో పూర్తిస్థాయి నాణ్యత లేదన్నారు. వెబ్ కాస్టింగ్ పరిధి అవతల సంఘటనల మాటేంటని ఆయన ప్రశ్నించారు.

click me!