
ఆ మహిళ నిండు గర్భిణీ. ప్రసవం అయ్యే సమయం దగ్గర పడటంతో స్థానికంగా ఉన్న ఓ గవర్నమెంట్ హాస్పిటల్ లో చేరారు. అయితే ఆ డాక్టర్లు ఆమెకు సిజేరియన్ చేశారు. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అంతా బాగానే ఉంది కానీ సర్జరీ జరిగిన 15 రోజుల తరువాత ఆమెకు కడుపులో నొప్పి వచ్చింది. దీంతో అదే హాస్పిటల్ కు వెళ్లారు. సమస్య ఏం లేదని, కొన్ని మందులు రాసిచ్చారు అక్కడి డాక్టర్. దీంతో అవి తీసుకొని ఇంటికి వచ్చారు. కానీ కొన్ని రోజుల తరువాత మళ్లీ విపరీతంగా కడుపులో నొప్పిరావడంతో వేరే హాస్పిటల్ కు వెళ్లారు. అక్కడ టెస్టులు చేసిన డాక్టర్లు ఖంగుతిన్నారు. కడుపులో ఏవో వస్తువులు ఉన్నాయని గుర్తించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆమెకు సర్జరీ జరిగింది.
ఈ ఘటనకు సంబంధిచి వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిషా (odisha)లోని కొరాట్ పూర్ జిల్లా (koraput district)కు చెందిన చేతన్ హల్బా (chetan halba) భార్య పేరు కాంచన్ (kanchan) గత సంవత్సరం అక్టోబర్ 3వ తేదీన డెలివరీ కోసం స్థానికంగా ఉండే ఓ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఆమెకు డాక్టర్లు సిజేరియన్ చేసి ప్రసవం చేశారు. అనంతరం ఆమెను ఐదు రోజుల తరువాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. దాదాపు ఒక పదిహేను రోజుల తరువాత కాంచన్ కు కడుపులో నొప్పి వచ్చింది. దీంతో భర్త ఆమెను అదే హాస్పిటల్ కు తీసుకొని వచ్చారు.
ఆ హాస్పిటల్ లో ఉన్న డాక్టర్ ఆమెను పరిశీలించి మందులు రాసి ఇచ్చారు. ఎలాంటి సమస్య లేదని చెప్పారు. ఆ మందులు వాడాలని సూచించారు. అయితే ఆ మందులు వాడినప్పటికీ దాదాపు మూడు నెలల తరువాత ఆమెకు మళ్లీ కడుపునొప్పి వచ్చింది. దీంతో ఆలస్యం చేయకుండా కాంచన్ ను కోరాపుట్ లోని డిస్ట్రిక్ట్ సెంట్రల్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అక్కడ ఆమెకు వివిధ పరీక్షలు నిర్వహించన డాక్టర్లు షాక్ అయ్యారు. ఆమె కడపులో ఏవో వస్తువులు ఉన్నాయని గుర్తించారు. వెంటనే సర్జరీ చేయాలని, లేకపోతే ఆమె ప్రాణాలకే ప్రమాదమని తెలిపారు.
కడపులో వస్తువులు ఉన్నాయని తెలిసిన తరవాత కాంచన్ ను వెంటనే విశాఖపట్నం (visakhapatnam)లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అక్కడి డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ చేశారు. కడుపులో ఉన్న హ్యాండ్ గ్లోవ్స్ (hand gloves)ను తీసివేశారు. ఈ సర్జరీ ఫిబ్రవరి 5వ తేదీన జరిగింది. ఈ ఘటనలో బాధితురాలి భర్త చేతన్ హల్బా మార్చి 18వ తేదీన రాయగడ పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తన భార్య ఆపరేషన్, మందుల కోసం దాదాపు 12 లక్షలు ఖర్చు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కలెక్టర్ సరోజ్ కుమార్ (collector saroj kumar) స్పందించారు. వెంటనే విచారణకు ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుంటామని చెప్పారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి, బాధితులకు న్యాయం చేస్తామని ఆ జిల్లా సీడీఎంవో (cdmo) తెలిపారు.