అన్నవరం యూనియన్ బ్యాంకులో అగ్ని ప్రమాదం..

Published : Mar 24, 2022, 10:41 AM IST
అన్నవరం యూనియన్ బ్యాంకులో అగ్ని ప్రమాదం..

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌ తూర్పు గోదావరి జిల్లా అన్నవరం యూనియన్ బ్యాంకులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం ఉదయం 8.30 గంటల సమయంలో బ్యాంకులో మంటలు చెలరేగాయి. 

ఆంధ్రప్రదేశ్‌ తూర్పు గోదావరి జిల్లా అన్నవరం యూనియన్ బ్యాంకులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం ఉదయం 8.30 గంటల సమయంలో బ్యాంకులో మంటలు చెలరేగాయి. బ్యాంకు నుంచి మంటలు వ్యాపించడం చూసిన స్థానికులు.. అధికారులకు సమాచారమిచ్చారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి  తీసుకురావడానికి యత్నించారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. 

బ్యాంకులో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో.. ఫర్నిచర్, ఇతర సామాగ్రి ధ్వంసమైంది. అయితే డబ్బులు, పత్రాలు భద్రపరిచే లాకర్‌ సురక్షితంగా ఉన్నట్టుగా సమాచారం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Chandrababu Naidu Speech | సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు నాయుడు | Asianet News Telugu
Kandula Durgesh Super Speech: ప్రతీ మాట ప్రజా సంక్షేమం కోసమే మాట్లాడాలి | Asianet News Telugu