రిపబ్లిక్ డేను పురస్కరించుకొని అమరావతిలోని పార్టీ కార్యాలయంలో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు మంగళవారం నాడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.
అమరావతి: రిపబ్లిక్ డేను పురస్కరించుకొని అమరావతిలోని పార్టీ కార్యాలయంలో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు మంగళవారం నాడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.
భవిష్యత్తులో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా, ఎన్ని సవాళ్లు వచ్చినా ధీటుగా ఎదుర్కొనేలా రాజ్యాంగాన్ని రచించారు. ప్రపంచ దేశాలన్నింటి రాజ్యాంగాలను క్షుణ్ణంగా పరిశీలించి అత్యంత పటిష్టమైన రాజ్యాంగాన్ని అందించినందుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చెప్పారు.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి పద్మవిభూషన్ అవార్డు ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వానికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.అన్నవరపు రామస్వామి, అనంతపురం జిల్లాకు చెందిన ప్రకాశరావుకి, నిడుమూరు సుమతి, నృత్యకళాకారుడు కనకరాజు గారికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించినందుకు ఆయన ధన్యవాదాలు చెప్పారు.దేశం కోసం ప్రాణాలర్పించిన కల్నల్ సంతోష్ బాబుకు మహావీర చక్ర అవార్డు ప్రకటించడం ఎంతో సంతోషకరం. గర్వకారణంగా ఆయన పేర్కొన్నారు.
ధర్మం నాలుగు పాదాలపై నడవాలన్నదే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం యొక్క లక్ష్యమన్నారు. రాగ ధ్వేషాలకు అతీతంగా పని చేసేందుకు ఈ సర్వీసుల్లోని వారికి పలు రాష్ట్రాల్లో విధుల కేటాయింపు జరుగుతుంది.
రాజ్యాంగం ప్రకారం సిద్ధించిన హక్కుల మేరకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుడైన నాకు, ప్రజలకు అందరికీ ఒకే రకమైన హక్కులు ఉంటాయని ఆయన చెప్పారు.
పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు.. వారికోసం ప్రత్యేకమైన రాజ్యాంగం ఉన్నట్లు వ్యవహరిస్తున్నారు. కానీ.. ప్రతి పౌరుడు కూడా రాజ్యాంగానికి కట్టుబడి పని చేయాలని గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. 20 నెలల పాలనలో ప్రజలు స్వేచ్ఛగా బతికే పరిస్థితి లేకుండా పోయిందన్నారు.
అడుగడుగునా మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొన్నారు. ప్రశ్నిస్తే దాడి, నిలదీస్తే హత్య, హక్కులడిగితే జైలు. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ ప్రభుత్వం ఇష్టానుసారంగా దుర్వినియోగం చేస్తోందని ఆయన మండిపడ్డారు.అమరావతి రైతులకు ఇచ్చిన హామీని ఏ విధంగా ఉల్లంఘిస్తారని ఆయన ప్రశ్నించారు.
అధికారంలోకి వచ్చీరాగానే ప్రజావేధికను కూల్చారు. ఇప్పుడు దాదాపు 150 దేవాలయాలపై దాడులు జరిగినా ప్రభుత్వం నుండి స్పందన లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.
అమెరికాలో ట్రంప్..ఏపీలో జగన్ తీరు ఒకే రకంగా ఉన్నాయని ఆయన విమర్శించారు.అమెరికాలో ట్రంప్, ఏపీలో జగన్ తీసుకొన్న నిర్ణయాలను పోలుస్తూ ఆయన విమర్శలు గుప్పించారు.ట్రంప్ కు జగన్ రెడ్డికి చాలా దగ్గరిపోలికలున్నాయని ఆయన సెటైర్లు వేశారు.ఉద్యోగ సంఘాల తీరును సుప్రీంకోర్టు ప్రశ్నించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
గవర్నర్ మౌనం ప్రజా హక్కులకు ప్రమాదకరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు గవర్నర్ వ్యవస్థను నేను కూడా వ్యతిరేకించా. కానీ.. ఇలాంటి ఉన్మాదులొస్తే పర్యవేక్షించే వ్యవస్థ అవసరమని గవర్నర్ వ్యవస్థను తర్వాత సమర్ధించామన్నారు.