డాక్టర్ ప్రియాంక సూసైడ్: డాక్టర్ నవీన్ అరెస్ట్

Published : Jan 24, 2021, 01:17 PM IST
డాక్టర్ ప్రియాంక సూసైడ్: డాక్టర్ నవీన్ అరెస్ట్

సారాంశం

గత ఏడాది ఆత్మహత్య చేసుకొన్న డాక్టర్ ప్రియాంక కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ నవీన్ ను పోలీసులు ఆదివారం నాడు అరెస్ట్ చేశారు.

విజయవాడ: గత ఏడాది ఆత్మహత్య చేసుకొన్న డాక్టర్ ప్రియాంక కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ నవీన్ ను పోలీసులు ఆదివారం నాడు అరెస్ట్ చేశారు.గత ఏడాది డిసెంబర్ 31న డాక్టర్ ప్రియాంక తన ఇంట్లో ఆత్మహత్య  చేసుకొంది.  నవీన్ కారణంగానే తాను ఆత్మహత్య చేసుకొంటున్నట్టుగా ఆమె ఆ లేఖలో పేర్కొంది. 

ఈ లేఖ ఆధారంగా పోలీసులు నవీన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రియాంక ఆత్మహత్య చేసుకొన్న సమయం నుండి డాక్టర్ నవీన్  పరారీలో ఉన్నాడు. మదనపల్లి, నెల్లూరు, కర్నూల్ లలో నవీన్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.  కర్నూల్ జిల్లాలో నవీన్ తలదాచుకొన్న విషయాన్ని గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

డాక్టర్ ప్రియాంకను కాకుండా మరో అమ్మాయితో నవీన్ పెళ్లికి సిద్దం కావడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకొందని సమాచారం. తన ఆత్మహత్యకు నవీనే కారణంగా  ఆమె సూసైడ్ లేఖలో పేర్కొంది.,  ప్రియాంక ఆత్మహత్య చేసుకొనే వరకు ప్రేమ విషయం తమకు తెలియదని కుటుంబసభ్యులు చెప్పారు. 
 

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu