ఏపీ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామ్ రెడ్డి వ్యాఖ్యలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అమరావతి: ఏపీ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామ్ రెడ్డి వ్యాఖ్యలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ డీజీపీ గౌతం సవాంగ్ కు వెంకట్రామ్ రెడ్డి వ్యాఖ్యలపై లేఖ రాశాడు. ఈ వ్యాఖ్యలపై డీజీపీ ఆదేశం మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు.
also read:స్థానిక ఎన్నికల షెడ్యూట్ రద్దు కోరుతూ ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు
ప్రాణాలు కాపాడుకొనేందుకు అవసరమైతే ప్రాణాలు తీయొచ్చని వెంకట్రామ్ రెడ్డి వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఏపీ డీజీపీకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ నెల 23న లేఖ రాశాడు.వెంకట్రామ్ రెడ్డి ఈ వ్యాఖ్యలు ఎక్కడ చేశారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆయన వ్యాఖ్యల టేపులను కూడ పోలీసులు విచారిస్తున్నారు.
కరోనా నేపథ్యంలో ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు విముఖత చూపుతున్నారు. కరోనా వ్యాక్సినేషన్ పూర్తయ్యేవరకు పంచాయితీ ఎన్నికల నిర్వహణను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.