ట్విస్ట్:డాక్టర్ సుధాకర్‌ చికిత్సకు మాధవీలత నియామకం, రాంరెడ్డి ఔట్

Published : May 31, 2020, 11:31 AM IST
ట్విస్ట్:డాక్టర్ సుధాకర్‌ చికిత్సకు మాధవీలత నియామకం, రాంరెడ్డి ఔట్

సారాంశం

డాక్టర్ సుధాకర్ కు చికిత్స చేసే వైద్యుడిని మార్చుతూ అధికారులు నిర్ణయం తీసుకొన్నారు. తనకు అందిస్తున్న చికిత్సతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని సుధాకర్ మెంటల్ ఆసుపత్రి సూపరింటెండ్ కు లేఖ రాశాడు. 


విశాఖపట్టణం:  డాక్టర్ సుధాకర్ కు చికిత్స చేసే వైద్యుడిని మార్చుతూ అధికారులు నిర్ణయం తీసుకొన్నారు. తనకు అందిస్తున్న చికిత్సతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని సుధాకర్ మెంటల్ ఆసుపత్రి సూపరింటెండ్ కు లేఖ రాశాడు. అంతేకాదు ఈ మందులు ఉపయోగిస్తే తాను పిచ్చివాడిగా మారే ప్రమాదం ఉందని కూడ ఆయన ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

తనకు అందిస్తున్న చికిత్స  విషయమై డాక్టర్ సుధాకర్ ఏపీ హైకోర్టులో పిటిషన్ కూడ దాఖలు చేశారు. మెంటల్ ఆసుపత్రి నుండి తనను మార్చాలని కూడ ఆయన ఆ పిటిషన్ లో కోరారు. 

ఇదే విషయమై డాక్టర్ సుధాకర్ కుటుంబసభ్యులు మెంటల్ హాస్పిటల్ సూపరింటెండ్‌ను కలిసి డాక్టర్ ను మార్చాలని కూడ కోరారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని డాక్టర్ సుధాకర్ కు చికిత్స చేసే డాక్టర్ రాంరెడ్డి స్థానంలో డాక్టర్ మాధవీలతను నియమించారు.

also read:డా. సుధాకర్ ఇష్యూ: రంగంలోకి సిబిఐ, పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు

డాక్టర్ సుధాకర్ ఈ నెల 16వ తేదీన విశాఖపట్టణంలో రోడ్డుపై అర్ధనగ్నంగా ప్రత్యక్షమయ్యాడు. మద్యం తాగి డాక్టర్ సుధాకర్ రభస సృష్టించాడని పోలీసులు ఆరోపించారు. ఈ సమయంలో ఆయనను ఆసుపత్రికి తరలించే సమయంలో పోలీసులు దాడికి దిగారు. 

also read:ప్రభుత్వం కక్ష సాధిస్తోంది: డాక్టర్ సుధాకర్ తల్లి ఆరోపణ

దీంతో సుధాకర్ పై దాడి చేసిన కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు విశాఖ సీపీ ఆర్ కె మీనా. మరో వైపు డాక్టర్ సుధాకర్ పై దాడిపై టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అనిత హైకోర్టుకు లేఖ రాసింది. ఈ లేఖను పిటిషన్ గా స్వీకరించింది హైకోర్టు. ఈ నెల 22వ తేదీన డాక్టర్ సుధాకర్ పై దాడి కేసును సీబీఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఈ మేరకు సీబీఐ అధికారులు ఈ నెల 30వ తేదీన విశాఖపట్టణంలో డాక్టర్ సుధాకర్ వాంగ్మూలాన్ని సేకరించినట్టుగా సమాచారం. ఈ కేసు పరిశోధనను సీబీఐ అధికారులు దర్యాప్తును ప్రారంభించారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu Attends Swachha Andhra Swarna Andhra Program in Nagari | Asianet News Telugu
నేను మారాను నన్ను నమ్మండి అనడం చంద్రబాబు కి అలవాటే: Perni Nani Comments | YCP | Asianet News Telugu