
అమరావతి: వైద్యుడు అంటే కనిపించే దేవుడు అంటారు. ప్రాణాలను నిలిపి పేషెంట్లకు దేవుడిలాగే మారుతారు. అలాంటి వైద్యులకు ప్రాణాలు విలువ ఎక్కువగా తెలిసి ఉంటుంది. కానీ, విజయవాడకు చెందిన ఓ వైద్యుడు మాత్రం శాడిజం చూపించడం మొదలుపెట్టాడు. రోజు ఫోన్‌లు చేస్తూ ఒంటరి కలవాలని డిమాండ్ చేస్తూ ఆ మహిళా వైద్యురాలి (Woman Doctor) ప్రాణాలు తోడేస్తున్నాడు. ఆ వైద్యురాలి భర్తకు ఫోన్ చేసి బెదిరింపుల(Threaten)కు పాల్పడ్డాడు. ఈ వేధింపులు తాళలేక ఆమె పోలీసులను ఆశ్రయించింది. మహిళా వైద్యురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఓ ప్రైవేటు హాస్పిటల్ డాక్టర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని (Sexual Harassment) మరో వైద్యురాలు విజయవాడలోని పడమట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కృష్ణా జిల్లాలోని మైలవరంలో సాయిదీప్ హాస్పిటల్ ఉన్నది. ఈ హాస్పిటల్‌లో డాక్టర్‌గా కృష్ణకిశోర్ పని చేస్తున్నాడు. గతంలో కృష్ణకిశోర్, ఈ మహిళా వైద్యురాలు ఓ హాస్పిటల్‌లో కలిసి పని చేశారు. అప్పుడు తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా కృష్ణ కిశోర్ కోరినట్టు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ, అందుకు తాను నిరాకరించినట్టు వివరించారు. ఆ విషయాన్ని అంతటితోనే వదిలేయకుడా తనపై వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఒక రోజు ఇంటికి వచ్చి బలవంతంగా తాళి కట్టడానికి ప్రయత్నించాడని తెలిపారు. తరుచూ ఫోన్‌లో బెదిరింపులకు పాల్పడుతున్నాడని వివరించారు.
పెళ్లికి తాను నిరాకరించడంతో తనపై కక్ష పెంచుకున్నాడని ఆమె ఫిర్యాదులో ఆరోపించారు. తనను వేధించడమే కాదు.. తన భర్తకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడని పేర్కొన్నారు. ఒంటరిగా కలవాలని డిమాండ్ చేస్తున్నాడని, ఆయన చెప్పిన చోటుకు రావాల్సిందిగా ఫోన్ చేసి బెదిరిస్తున్నాడని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా విజయవాడ పడమట పోలీసులు కేసు నమోదు చేశారు.
ట్రైనింగ్ నర్సుతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపణలు ఎదుర్కొంటోన్న సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ నర్సింగ్ చౌహన్‌పై సస్పెన్షన్ వేటు పడింది. అతనిని తాత్కాలికంగా విధుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, Narayana Khed ఏరియా ఆస్పత్రిలో సూపరింటెండెంట్ విధులు నిర్వహిస్తోన్న నర్సింగ్ చౌహాన్ తనను వేధించాడంటూ సునీత అనే Training Nurse పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఛాంబర్ కు తీసుకెళ్లి వ్యక్తిగత విషయాలు అడిగాడని.. బావ వరుస అవుతానని చెంపలపై చేతులు వేసి Obsceneగా ప్రవర్తించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
తెలుగు అకాడమీ స్కాం : ఎఫ్‌డీల కుంభకోణంలో మరొకరికి బేడీలు.. ఆమె ఎవరంటే...
వివరాల్లోకి వెడితే.. శిక్షణలో ఉన్న నర్సింగ్ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ కోరిక తీర్చాలని వేధిస్తున్న డాక్టర్ కు ఆమె బంధువులు ఊహించని షాక్ ఇచ్చారు. ఆస్పత్రికి భారీగా చేరుకుని డాక్టర్ రోడ్డు మీదకి లాగి దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో జరిగింది. ఈ సంఘటనను సీరియస్ గా తీసుకున్న తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్.. ఆసుపత్రి సూపరింటెండెంట్ Dr. Nursing Chauhan ను సస్పెండ్ చేస్తూ గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.