ఏపీలో నిలకడగా కరోనా కేసులు.. 24 గంటల్లో 104 మందికి పాజిటివ్, చిత్తూరులో అత్యధికం

Siva Kodati |  
Published : Dec 25, 2021, 07:25 PM ISTUpdated : Dec 25, 2021, 07:26 PM IST
ఏపీలో నిలకడగా కరోనా కేసులు.. 24 గంటల్లో 104 మందికి పాజిటివ్, చిత్తూరులో అత్యధికం

సారాంశం

ఏపీలో కొత్తగా 104 కరోనా కేసులు (corona cases in ap) నమోదవ్వగా.. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 133 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1,249 మంది చికిత్స పొందుతున్నారు.  

ఆంధ్రప్రదేశ్‌‌‌లో కరోనా కేసులు స్వల్పంగా (corona cases in ap) తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 104 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,73,515కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,489కి చేరుకుంది. 

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల నెల్లూరు జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 133 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,57,777కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 29,643 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,11,56,578కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1249 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 3, చిత్తూరు 18, తూర్పుగోదావరి 12, గుంటూరు 11, కడప 7, కృష్ణ 10, కర్నూలు 0, నెల్లూరు 7, ప్రకాశం 1, శ్రీకాకుళం 10, విశాఖపట్నం 9, విజయనగరం 0, పశ్చిమ గోదావరిలలో 16 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

Rain Alert: ఎండల వేడికి బ్రేక్.. ఉరుములు, మెరుపులతో వర్షాలు.. ఐఎండీ కూల్ అప్‌డేట్
Jogi Ramesh vs Police: పారిపోతున్న జోగి రమేష్ వేటాడి పట్టుకున్న పోలీసులు| Asianet News Telugu