
తమిళనాడులో సిఎం విశ్వాసపరీక్ష సందర్భంగా సందర్భంగా డిఎంకె ఓవర్ యాక్షన్ చేస్తోంది. పళనిస్వామిపై విశ్వాస పరీక్ష సందర్బంగా ఏఐఏడిఎంకెలోని పళని, పన్నీర్ వర్గాలు బాగానే ఉన్నాయి. మధ్యలో డిఎంకె ఓవర్ యాక్షన్ ఏమిటో అర్ధం కావటం లేదు. బలపరీక్ష మొదలుకాకముందే, రహస్య ఓటింగ్ నిర్వహించాలని పన్నీర్ సెల్వం డిమాండ్ చేసారు. అందుకు డిఎంకె అధినేత స్టాలిన్ కూడా మద్దతు ప్రకటించారు. అయితే, స్పీకర్ ధనపాల్ ఏమి చెప్పారో స్పష్టత లేదు. ఇంతలో ఓటింగ్ మొదలైనట్లు వార్తలు వచ్చాయి. వెంబడే అసెంబ్లీలో గందరగోళం మొదలైంది. రహస్య ఓటింగ్ కు డిఎంకె పట్టువీడ కుండా గొడవ చేస్తూనే ఉంది.
అయితే, డిమాండ్ ను స్పీకర్ పట్టించుకోకపోవటంతో డిఎంకె గొడవ మొదలుపెట్టింది. అంతేకాకుండా డిఎంకె సభ్యులు స్పీకర్ పోడియం వైపు దూసుకువెళ్ళారు. కర్చీలు, బల్లలను ధ్వంసం చేసారు. కాగితాలు చించి స్పీకర్ మొహంపై విసిరికొట్టటంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇటు పళని, అటు పన్నీర్ వర్గాల మధ్య గొడవలవుతాయని అనుకున్నారు. అయితే, అనూహ్యంగా డిఎంకె వైపు నుండి గొడవ మొదలవ్వటంతో డిఎంకె ఓవర్ యాక్ష చేస్తోందనే అనుకుంటున్నారు. స్పీకర్ గొడవను సర్దుబాటు చేసేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దాంతో సభను 1 గంటకు స్పీకర్ వాయిదా వేసారు.