సీఎం జగన్‌తో దివ్యతేజ పేరేంట్స్ భేటీ: నిందితుడిపై చర్యలకు డిమాండ్

By narsimha lodeFirst Published Oct 20, 2020, 3:37 PM IST
Highlights

ఏపీ సీఎం వైఎస్ జగన్ తో ఇంజనీరింగ్ విద్యార్ధిని దివ్య తేజ తల్లిదండ్రులు మంగళవారం నాడు సమావేశమయ్యారు.


అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ తో ఇంజనీరింగ్ విద్యార్ధిని దివ్య తేజ తల్లిదండ్రులు మంగళవారం నాడు సమావేశమయ్యారు.

ఈ నెల 15వ తేదీన నాగేంద్రబాబు చేతిలో దివ్యతేజ మరణించింది. దివ్యతేజ పేరేంట్స్ ను రాష్ట్ర హోంశాఖ మంత్రి సుచరిత పరామర్శించారు.  సీఎం జగన్ ను కలిసేందుకు అవకాశం కల్పించాలని దివ్యతేజ పేరేంట్స్ కోరారు. దీంతో హోం మంత్రి సుచరితతో కలిసి దివ్యతేజ పేరేంట్స్ ఇవాళ సీఎంను కలిశారు.

also read:దివ్యతేజ మృతికి కారణమిదీ: పోస్టుమార్టం నివేదికలో కీలక విషయాలు

తమ కూతురిని చంపిన నాగేంద్రబాబును  ఎన్ కౌంటర్ చేయాలని దివ్యతేజ తల్లి గతంలోనే డిమాండ్ చేశారు.తమ కూతురిని పథకం ప్రకారంగా నాగేంద్ర బాబు హత్య చేశారని బాధిత కుటుంబం ఆరోపించింది.

క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ ను దివ్యతేజ కుటుంబం కలిసింది. నాగేంద్రబాబును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.దివ్యతేజ గొంతుపై బలమైన గాయాలున్నాయి. ఈ గాయాల కారణంగా ఆమె మరణించినట్టుగా  పోస్ట్ మార్టం నివేదిక తెలిపింది. కడుపులో కూడ కత్తిపోటు గాయాలున్నట్టుగా ఈ నివేదిక తెలిపింది. 

click me!