విశాఖపట్నంలో దిశ SOS ఎఫెక్ట్.. యువతి కాల్ చేయగానే వెంటనే స్పాట్‌కు దిశ టీం

By Mahesh KFirst Published Jun 21, 2023, 6:48 PM IST
Highlights

విశాఖపట్నం బీచ్‌లో యువతీ యువకుడి మధ్య ఘర్షణ జరిగింది. ఆమె భయంతో దిశ SOSకు కాల్ చేసి ఫిర్యాదు చేసింది. దిశ టీం వెంటనే అలర్ట్ అయి స్పాట్‌కు చేరుకుంది. ఆమెను సురక్షితంగా ఇంటి వద్ద డ్రాప్ చేసి ఆమె పై దాడి చేసి యువకుడిని గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చింది.
 

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో దిశ SOS తన పని తీరును మరోసారి మహిళల రక్షణకు సకాలంలో సహాయం అందిస్తామని నిరూపించుకుంది. ఓ యువతి, యువకుడు బీచ్‌కు వెళ్లారు. అక్కడ యువతిపై యువకుడు దూషణలు చేస్తూ చేయి చేసుకోగా.. ఆమె భయంతో దిశ SOSకు ఫోన్ చేసింది. దిశ టీం వెంటనే చేరుకుంది. ఆమెకు భరోసానిచ్చి ఇంటి వద్ద డ్రాప్ చేసింది. ఈ ఘటన విశాఖపట్నంలోని మువ్వలవానిపాలెం పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.

లెనిన్ అనే యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఆర్ కే బీచ్‌కు వెళ్లాడు. అక్కడ ఆమెను అనుమానిస్తూ భీతి గొలిపేలా వ్యవహరించాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి గొడవ పెద్దదైంది. ఆమెను తీవ్ర పదజాలంతో దూషించాడు. ఆమె పై దాడి చేసి కూడా గాయపరిచాడు. దీంతో ఆ యువతి హతాశయురాలైంది. వెంటనే దిశ SOSకు కాల్ చేసి ఫిర్యాదు చేసింది. దిశ టీం వెంటనే అలర్ట్ అయింది.

Latest Videos

Also Read: ఢిల్లీలో లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా దత్తాత్రేయ హాజరు

బాధితురాలు కాల్ చేసినప్పటి లొకేషన్‌కు దిశ టీం వెంటనే చేరుకుంది. కానీ, అప్పటికే లెనిన్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఒంటరిగా ఉన్న యువతికి దిశ పోలీసులు ధైర్యం చెప్పారు. యువతిని ఆమె ఇంటి వద్ద డ్రాప్ చేసి భరోసానిచ్చారు.

అనంతరం, ఆ యువతిపై చేయి చేసుకున్న లెనిన్‌ను గుర్తించారు. ఆయనకు కౌన్సిలింగ్ ఇచ్చారు. లెనిన్ పశ్చాత్తాపంతో ఆమెకు క్షమాపణలు చెప్పాడు. ఇలాంటి ఘటన పునరావృతం కాబోదన హామీ ఇచ్చాడు. దిశ టీం వెంటనే స్పందించినందుకు యువతి కృతజ్ఞతలు తెలిపింది.

click me!