నెల్లూరు జిల్లాలోని బాణసంచా కేంద్రంలో ఇవాళ అగ్ని ప్రమాదం జ.రిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు.
నెల్లూరు: జిల్లాలోని చేజర్ల మండలం మాముడూరు వద్ద ఆదివారంనాడు బాణసంచా కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన ఐదుగురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందిగాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. బాధితులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా బాణసంచా తయారీ కేంద్రాల్లో ప్రమాదాలు జరిగిన ఘటనలు గతంలో చోటు చేసుకున్నాయి. ప్రమాదాలు జరిగిన సమయాాల్లో అధికారులు పలు జాగ్రత్తలు సూచించారు. బాణసంచా తయారీ కేంద్రాల్లో కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు. చాలా చోట్ల అనుమతి లేకుండానే బాణసంచా తయారీ కేంద్రాల నిర్వహణ కూడ ప్రమాదాలకు కారణమౌతున్నాయి.
undefined
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని తూర్పు మిడ్నాపూర్ బాణసంచా కేంద్రంలో ఈ నెల 16న ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు.తమిళనాడులోని కాంచీపురంలో గల బాణసంచా కేంద్రంలో పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటన ఈ ఏడాది మార్చి 23న చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు.
ఈ ఏడాది మార్చి 21న దక్షిణ 24 పరగణాల జిల్లాలోని బాణసంచా కేంద్రంలో పేలుడు చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈ బాణసంచా కేంద్రానికి అనుమతి లేదని అధికారులు గుర్తించారు. మరో వైపు ఈ ఏడాది మార్చి 6న ఒడిశా రాష్ట్రంలో జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. బాణపంచా తయారు చేస్తున్న సమయంలో పేలుడు జరిగింది.