ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh)లోని రాజమండ్రి (rajahmundry)లో ఓ మామ తన కొత్త అల్లుడికి జీవితంలో గుర్తుండిపోయే విందు ఇచ్చాడు. ఏకంగా 200 రకాల వంటకాలను ( 200 types of dishes for new son-in-law) తయారు చేయించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లాలు అంటే మర్యాదలకు మారు పేరు. ఆ జిల్లాలకు ఎవరు వెళ్లిన మార్యాదలతో ముంచెత్తుతారు. అలాంటిది కొత్త అల్లుడిని ఎలా చూసుకుంటారనేది చెప్పక్కర్లేదు. సంక్రాంతి సందర్భంగా కొత్తగా పెళ్లయిన కూతురు, అల్లుడిని ఇంటికి తీసుకురావడం, వారికి విందు ఏర్పాటు చేయడం అనవాయితీగా వస్తోంది.
మోడీ మళ్లీ ప్రధాని అయిన రోజు దేశ ప్రజలందరికీ సంక్రాంతి - కిషన్ రెడ్డి
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంత్రి పండుగను జరుపుకుంటారు. అయితే ఏపీలో మాత్రం ఈ పండగ ఘనంగా నిర్వహిస్తారు. కోడి పందేలు, గంగిరెద్దులు, పిండి వంటలు అబ్బో ఒకటేమిటీ.. ఈ పండగను ఏడాదంతా గుర్తుండిపోయేలా జరుపుకుంటారు. చదువుల కోసం, ఉద్యోగాల కోసం దేశంలో ఎక్కడ ఉంటున్నా.. సంక్రాంత్రి పండగకు మాత్రం ఊరొచ్చేస్తారు. హైదరాబాద్ లో ఉన్న సెటిలర్లు కూడా ఏపీకి పయనమవుతారు. అందుకే ఇప్పుడు హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
పేదల కోసమే పదేళ్లుగా అంకితం: రూ. 540 కోట్లు విడుదల, గిరిజనులతో మోడీ ముచ్చట
మాములుగానే ఏపీలోని గోదావరి జిల్లాల్లో ఫుడ్ కు ప్రియారిటీ ఉంటుంది. అలాంటింది సంక్రాంతి సమయంలో ఏ మాత్రం తగ్గేద్యేలా అన్నట్టుగా ఉంటారు. ఇక కొత్త అల్లుడి కోసం ఏర్పాటు చేసే విందునైతే జీవితంలో గుర్తిండిపోయేలా చేస్తారు. అయితే ఈ పండగకు కూడా కొత్త అల్లుళ్లకు అలాంటి మర్యాదలే జరుగుతున్నాయి.
తెలంగాణలో ఇక నుంచి ‘ఎంసెట్’ మాయం.. ఎందుకంటే ?
తాజాగా రాజమండ్రి జిల్లాలోని ఓ ఉద్యోగి తన కొత్త అల్లుడికి ఇచ్చిన విందు వార్తల్లో నిలిచింది. ఎందుకంటారా ? కొత్త అల్లుడి కోసం అత్తా-మామ ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 200 రకాల వంటకాలు ఏర్పాటు చేశారు. ఆ వంటకాల అన్ని పెట్టేందుకు టేబుల్ కూడా సరిపోలేదు. చివరికి వాటిని ఎలాగో సెట్ చేశారు. వాటి ముందు కొత్త అల్లుడిని, కూతురును కూర్చొబెట్టి అన్ని వంటకాలను రుచి చూపించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.