చంద్రబాబుపై రాళ్ల దాడి.. ఎలాంటి ఆధారాలు దొరకలేదు: తేల్చిచెప్పిన డీఐజీ

By Siva KodatiFirst Published Apr 13, 2021, 9:34 PM IST
Highlights

తిరుపతిలో చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడికి సంబంధించి డీఐజీ క్రాంతి రాణా స్పందించారు. దాడిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనలో గాయాలైన ఇద్దరు వ్యక్తులను కూడా విచారించామని డీఐజీ పేర్కొన్నారు.

తిరుపతిలో చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడికి సంబంధించి డీఐజీ క్రాంతి రాణా స్పందించారు. దాడిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనలో గాయాలైన ఇద్దరు వ్యక్తులను కూడా విచారించామని డీఐజీ పేర్కొన్నారు.

వారిని సంఘటన స్థలానికి తీసుకెళ్లి సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేశామని క్రాంతి రాణా చెప్పారు. స్థానిక సీసీ కెమెరాలు, మొబైల్, మీడియా ఫుటేజ్‌లను కూడా పరిశీలించామని డీఐజీ వెల్లడించారు. చంద్రబాబు సభకు ఆటంకం కలిగించాలని, దుండగులు వచ్చి రాళ్లు విసిరినట్లు ఎక్కడా ఆధారాలు లభించలేదని ఆయన స్పష్టం చేశారు.

చంద్రబాబు సభకు ఎలాంటి ఆటంకం కలుగకుండా యథావిథిగా జరిగిందని, సభ అయిపోయిన తర్వాత చంద్రబాబు వైపు రాళ్లు విసిరినట్లు తమకు ఫిర్యాదు అందిందని క్రాంతి రాణా వెల్లడించారు. కాగా, సోమవారం నాడు తిరుపతి రైల్వేస్టేషన్ నుండి కృష్ణాపురం వరకు బాబు రోడ్ షో నిర్వహించారు.  

Also Read:రాళ్లు విసిరిన వారిని చూశారా?: బాబు భద్రతా సిబ్బందిని ప్రశ్నించిన పోలీసులు

ఇక్కడే సభలో ప్రసంగిస్తున్న సమయంలో రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచార వాహనం వద్దే రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు.ఆ తర్వాత ఆయన పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారు. 

మంగళవారం నాడు ఉదయం తిరుపతి వెస్ట్ పోలీసులు చంద్రబాబునాయుడు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని ప్రశ్నించారు.  రాళ్లు వేసినవారిని చూశారా?, రాళ్లు ఏ వైపు నుండి వచ్చాయనే విషయమై ప్రశ్నించారు. రాళ్లు వేసినవారిని గుర్తు పడతారా అని బాబు సెక్యూరిటీని ప్రశ్నించారు.

click me!