చిత్తూరులో దారుణం: కూతురిని ప్రేమించాడని ముక్కలు ముక్కలుగా నరికాడు

Published : May 28, 2021, 01:11 PM ISTUpdated : May 28, 2021, 01:14 PM IST
చిత్తూరులో దారుణం: కూతురిని ప్రేమించాడని ముక్కలు ముక్కలుగా నరికాడు

సారాంశం

 తన కూతురిని ప్రేమించాడనే నెపంతో యువకుడిని యువతి తండ్రి దారుణంగా నరికి చంపాడు. యువకుడి మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. నాలుగు రోజుల తర్వాత యువకుడి మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. 

చిత్తూరు: తన కూతురిని ప్రేమించాడనే నెపంతో యువకుడిని యువతి తండ్రి దారుణంగా నరికి చంపాడు. యువకుడి మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. నాలుగు రోజుల తర్వాత యువకుడి మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. చిత్తూరు జిల్లాలోని పలమనేరు మండలంలోని పెంగరగుంటలో ఈ ఘటన చోటు చేసుకొంది.  పెంగరగుంట గ్రామానికి చెందిన యువకుడు ధనశేఖర్, శైలజలు రెండేళ్లుగా ప్రేమించుకొంటున్నారు. పెళ్లి కూడ చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు. 

ఈ విషయమై ధనశేఖర్ ను మాట్లాడాలని శైలజ తండ్రి పిలిపించాడు. తన పొలానికి పిలిపించి ధనశేఖర్ ను హత్య చేశాడు.  ధనశేఖర్  మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. ఈ మృతదేహాన్ని బయటకు తీశారు పోలీసులు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

నాలుగు రోజులుగా ధనశేఖర్ ఆచూకీ లేకుండా పోయాడు. ఈ విషయమై కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ధనశేఖర్ ఫోన్ కు చివరిసారిగా శైలజ తండ్రి ఫోన్ చేశాడు. ఈ ఫోన్  సమాచారం ఆధారంగా  పోలీసులు విచారణ చేపట్టారు.శైలజ కుటుంబసభ్యులు గ్రామం విడిచిపారిపోయాడు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గతంలో ఈ గ్రామానికి సమీపంలోనే పరువు హత్య చోటు చేసుకొంది. అయితే తాజాగా మరోసారి ప్రేమ వ్యవహరంలో హత్య చోటు చేసుకోసుకోవడం మరోసారి చర్చకు కారణమైంది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే