ఏపీలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స దోపీడీకి చెక్: రూల్స్ బ్రేక్ చేస్తే భారీ ఫైన్, కేసులు

By narsimha lode  |  First Published May 28, 2021, 12:40 PM IST

కరోనా రోగులకు చికిత్స చేసే సమయంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ ఆసుపత్రులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 


అమరావతి: కరోనా రోగులకు చికిత్స చేసే సమయంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ ఆసుపత్రులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కరోనా రోగులకు చికిత్స అందించే విషయంలో  నిబంధనలు ఉల్లంఘించే ఆసుపత్రులపై చర్యలు తీసుకోనేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఇప్పటికే రాష్ట్రంలోని 581 ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నిబంధనలకు విరుద్దంగా డబ్బులు వసూలు చేస్తే పది రెట్లు జరిమానా విధించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండోసారి ఇదే రకమైన తప్పు చేస్తే క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ ప్రకారంగా కేసులు పెట్టాలని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం తేల్చి చెప్పిది. 

నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన 11 ఆసుపత్రుల అనుమతులను  ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పటికే రూ 3,721 కోట్లు జరిమానాలను వసూలు చేసింది.  రాష్ట్రంలో ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించిన 54 ప్రైవేట్ ఆసుపత్రులపై  ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. కరోనా సమయంో పలు ప్రైవేట్ ాఆసుపత్రులపై పలు  ఫిర్యాదులు అందాయి. ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వం విధించిన రూల్స్ ను బ్రేక్ చేస్తే చర్యలు తీసుకోవాలని  ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకొంది. ఇందులో భాగంగానే శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. 

Latest Videos

 

click me!