రాజ‌కీయాల‌ను ముంచెత్తిన భ‌క్తి... ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్ర.. !

By Mahesh RajamoniFirst Published Oct 5, 2022, 12:16 PM IST
Highlights

Amaravati: అమరావతి పరిరక్షణ సమితి తొలుత దుర్గాదేవి ఆలయానికి, ఆ తర్వాత అమరావతి నుంచి తిరుపతి వరకు పాదయాత్ర నిర్వహించి, ఇప్పుడు అమరావతి నుంచి అరసవిల్లి వరకు పాదయాత్ర చేస్తూ ఉద్య‌మంలో భ‌క్తిని చాటుకుంటోంది. 
 

VIJAYAWADA: ఆంధ్రప్రదేశ్ లో రాజ‌ధాని అంశంపై రాజ‌కీయ ర‌చ్చ కొన‌సాగుతూనే ఉంది. అధికార పార్టీ వైకాపా మూడు రాజ‌ధానుల కోసం ముందుకుసాగుతోంది. ఇదే స‌మ‌యంలో అమ‌రావ‌తినే రాష్ట్ర రాజ‌ధానిగా కొన‌సాగించాల‌ని ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీ (టీడీపీ), ఆ ప్రాంత రైతులు, ప్ర‌జ‌లు డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌లు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అయితే, ఈ పొలిటిక‌ల్ ఉద్య‌మంలోకి ఇప్పుడు భ‌క్తి మంత్ర వ‌చ్చి చేరింది. అమ‌రావ‌తినే రాజ‌ధానిగా కొన‌సాగించాల‌నే వ‌ర్గాల‌తో పాటు మూడు రాజ‌ధానుల‌కు మొగ్గుచూపుతున్న వారు రాష్ట్రంలోని దేవాల‌యాలు కేంద్రంగా ముందుకు సాగుతుండ‌టం ర‌చ్చ చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆంధ్ర ప్ర‌దేశ్ కు మూడు రాజధానులు ఉండాలనే సంకల్పంపై అదనపు దృష్టి సారించేందుకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స‌రికొత్త ప్ర‌జ‌ల్లోకి మ‌రో స‌రికొత్త ప్ర‌ణాళిక‌ను తీసుకువ‌చ్చింది. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలను బుధవారం విజయ దశమి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో పూజలు, కొబ్బరికాయలు పగలగొట్టాలని కోరింది.

అమరావతి పరిరక్షణ సమితి జాయింట్ యాక్షన్ కమిటీ (ఏపీఎస్ఎ జేఏసీ) మొట్టమొదటగా భక్తిని తీసుకువచ్చి, ఏకైక రాజధానిగా అమరావతి కోసం దేవుడికి విజ్ఞప్తి చేసింది. తెలుగుదేశం, ఇతర ప్రతిపక్ష పార్టీల మద్దతు ఉన్న ఈ కమిటీ మహిళల చేత దుర్గ గుడికి పాదయాత్ర నిర్వహించింది. ఆ త‌ర్వాత జేఏసీ అమరావతికి వచ్చి తిరుపతి వ‌ర‌కు పాదయాత్రను సజావుగా సాగించింది. ప్రస్తుతం మరో యాత్ర ఇప్పటికే అమరావతిని వదిలి కోస్తా జిల్లాల గుండా వెళ్లి సూర్యభగవానుడికి ఆలయం ఉన్న అరసవిల్లికి చేరుకుని, ఏపీ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి ఉండాల‌ని కోరుకోవ‌డంతో పాటు అక్క‌డ ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించ‌నుంద‌ని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. 

అధికార వైఎస్ఆర్సీ తన వికేంద్రీకరణ రాజధానుల అంశాన్ని సీరియస్ గా హైలైట్ చేయలేదు. కానీ 2024 ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార పార్టీ నాయకులు తీరప్రాంత జిల్లాల్లో తమ సొంత అఖిలపక్ష సమావేశాలు, రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించడం ప్రారంభించారు. అభివృద్ధి వికేంద్రీకరణ ఆవశ్యకతను నొక్కి చెబుతూ మంత్రులు, వైఎస్సార్సీ శాసనసభ్యులు వాటిలో పాల్గొంటున్నారు. దీంతో రాజ‌ధాని విష‌యంలో పొలిటిక‌ల్ వార్ మ‌రింత ముదిరింది. ఇప్పుడు దసరా ఉత్సవాలు తారాస్థాయికి చేరుకోవడంతో వైసీపీ నేతలు కూడా మూడు రాజధానుల కోసం భక్తిశ్రద్ధలు, ప్ర‌త్యేక పూజ‌ల‌తో ముందుకు సాగాల‌ని నిర్ణయించుకున్నారు. విజయదశమి రోజున రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ వికేంద్రీకరణ.. మూడు రాజ‌ధానుల అంశం కోసం ప్రార్థించాలని, కులమతాలకు అతీతంగా అన్ని దేవాలయాల్లో కొబ్బరికాయలు పగలగొట్టాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సీహెచ్ వేణుగోపాల కృష్ణ, మాజీ మంత్రి కురసాల కన్నబాబు తదితరులు అన్నారు.

అమరావతిలో రాజధాని కోసం కుట్ర పన్నిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి వివేకం కోసం దుర్గామాతను ప్రార్థించే విజయ దశమి కంటే మంచి రోజు మరొకటి ఉండదని వారు అంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమరావతిని శాసనసభా రాజధానిగా అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నారని, అయితే రాష్ట్ర వికేంద్రీకృత అభివృద్ధి కోసం విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఉండాలని వారు కోరుతున్నారు. వైఎస్సార్సీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మూడు రాజధానుల ద్వారా రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయాలని కోరుతూ ప్రతి పార్టీ కార్యకర్త దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేయాలన్నారు. 

click me!