కేసీఆర్ కు భయపడే జగన్ తెలంగాణలో పోటీ చెయ్యలేదు: దేవినేని ఉమ

Published : Dec 14, 2018, 10:31 AM ISTUpdated : Dec 14, 2018, 10:33 AM IST
కేసీఆర్ కు భయపడే జగన్ తెలంగాణలో పోటీ చెయ్యలేదు: దేవినేని ఉమ

సారాంశం

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ భారీనీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న నిరోధకుడు అంటూ మండిపడ్డారు. కేసీఆర్ కు భయపడే జగన్ తెలంగాణలో పోటీ చెయ్యలేదని ఆరోపించారు. 

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ భారీనీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న నిరోధకుడు అంటూ మండిపడ్డారు. కేసీఆర్ కు భయపడే జగన్ తెలంగాణలో పోటీ చెయ్యలేదని ఆరోపించారు. 

ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్న నిరోధకులతో జగన్ జట్టు కడుతున్నారంటూ మండిపడ్డారు. ఆ అవినీతి నిరోధక జట్టుకు కెప్టెన్ వైఎస్ జగన్ అని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు శరవేగంగా పూర్తవుతుంటే జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలో కుహనా మేధావులు ఎక్కువ అయ్యారంటూ సెటైర్లు వేశారు. ముందు జగన్ ప్రజలు అప్పగించిన ప్రతిపక్ష బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలని హితవు పలికారు. అంతేకానీ ప్రజా సమస్యలను గాలికొదిలేసి రోడ్లపై తిరుతున్నారంటూ ఉమా ధ్వజమెత్తారు.
 

PREV
click me!

Recommended Stories

Roja vs Kirrak RP: నీ పిల్లల ముందు ఇలాంటి మాటలు అనగలవా? రోజాకు గట్టిగా ఇచ్చేసిన కిర్రాక్ ఆర్పి
YS Jagan Massive Rally & Governor Meet: అభిమానులు పెద్ద సంఖ్యలో మద్దతు | YSRCP | Asianet News Telugu