వాళ్లు చేసిన పాపాలు బయటపడాలి... దేవినేని

Published : May 17, 2019, 09:53 AM IST
వాళ్లు చేసిన పాపాలు బయటపడాలి... దేవినేని

సారాంశం

ప్రశాంత్ కిశోర్, జగన్, విజయసాయి రెడ్డి చేసిన పాపాలు బయటకు రావాలని మంత్రి దేవినేని ఉమా పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...  జగన్ పై మండిపడ్డారు. 

ప్రశాంత్ కిశోర్, జగన్, విజయసాయి రెడ్డి చేసిన పాపాలు బయటకు రావాలని మంత్రి దేవినేని ఉమా పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...  జగన్ పై మండిపడ్డారు.  ఈవీఎంలకు మరమ్మతులు చేయాలని లేదంటే కొత్తవి పెట్టాలన్నారు. మరమ్మతుల కోసం ఆరు గంటల సమయం తీసుకున్నారని.. ఒక ఈవీఎం స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడానికి ఆరు గంటల సమయం అవసరమా అని ప్రశ్నించారు.

 ఈవీఎంలు పాడైపోతే మళ్లీ వచ్చి పోలింగ్‌లో పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈసారి కేంద్రంలో కొత్త ప్రధాని రావడం ఖాయమని ఉమ పేర్కొన్నారు. ఏపీలో మళ్లీ తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

దేశ రాజకీయాల్లో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలని జగన్‌ కోట్లు ఖర్చు పెట్టారని.. ఆయన కుట్రలకు అడ్డులేకుండా పోతోందన్నారు.తెలంగాణలో టీఆర్‌ఎస్‌, ఏపీలో వైసీపీ గెలవాలని... కేవీపీ కుట్రలు పన్నారని ఉమ ఆరోపించారు. పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేవీపీ అంటున్నారని.. అయితే పోలవరానికి సంబంధించిన సమాచారమంతా ఆన్‌లైన్‌‌లో ఉందన్నారు.

PREV
click me!

Recommended Stories

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం లోఫుడ్ కమీషన్ చైర్మన్ తనిఖీ | Asianet News Telugu
LVM3-M6 Success Story | ప్రపంచానికి భారత్ సత్తా చాటిన ఇస్రో బాహుబలి | Asianet News Telugu