రీపోలింగ్‌ వెనుక సీఎస్ ఉన్నాడన్న టీడీపీ: ఖండించిన ఎల్వీ

By Siva KodatiFirst Published May 17, 2019, 9:26 AM IST
Highlights

చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌ విషయంలో తనపై తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఖండించారు.

చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌ విషయంలో తనపై తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఖండించారు. చంద్రగిరిలోని 7 గ్రామాల్లో ఎస్సీలు ఓట్లు వేయలేదని తమకు ఫిర్యాదు అందిందని ఆయన తెలిపారు.

ప్రతి ఒక్కరు ఓటు వేసేలా చూడటం అధికారులుగా తమ బాధ్యతని ఎల్వీ స్పష్టం చేశారు. రీపోలింగ్ విషయంలో తనను, ఇతర అధికారులను తప్పుబట్టడం సరికాదన్నారు. పాలన గుడిగా సాగే పరిస్ధితి రానివ్వకూడదని సీఎస్ అభిప్రాయపడ్డారు.

కాగా ఎన్నికలు ముగిసిన 34 రోజుల తర్వాత చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్‌కు ఈసీ ఆదేశించడంపై తెలుగుదేశం పార్టీ మండిపడింది. ఈ వ్యవహారం వెనుక చీఫ్ సెక్రటరీ హస్తం ఉందంటూ టీడీపీ నేతలు ఆరోపించారు.

click me!