హత్యా రాజకీయాలకు మేం దూరం: డిప్యూటి సిం కెఇ

Published : May 22, 2017, 01:41 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
హత్యా రాజకీయాలకు  మేం దూరం: డిప్యూటి సిం కెఇ

సారాంశం

వచ్చే ఎన్నికల్లో మా అబ్బాయి పోటీ చేస్తున్నాడు కాబట్టే మా అబ్బాయిపై ఆరోపణలు. రాజకీయంగా మా అబ్బాయి యాక్టీవ్ అయ్యారు. అందుకే ఆరోపణలు.జగనుది దింపుడు కళ్లెం ఆశ. ప్రతి దాన్ని రాజకీయం చేస్తే తనకు ఉపయోగపడుతుందనే ఆశతో జగన్ ఉన్నారు.

 

హత్యా రాజకీయాలకు తాను, తన కుటుంబం దూరమని ఉప ముఖ్యమంత్రి కె ఇ కృష్ణమూర్తి అన్నారు.

నిన్న జరిగిన కర్నూలు జిల్లా వైసిపి నాయకుడు నారాయణ రెడ్డి హత్యలో కెఇ కుటుంబం పాత్ర ఉందని  ప్రతిపక్ష పార్టీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

 ఈ విషయం మీదే ప్రతిపక్షనాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఒక ప్రతినిధి బృందం ఈ రోజు హైదరాబాద్ లో గవర్నర్ కలసి ఈ హత్య మీద పిర్యాదు చేసింది. దీనిమీద  ఈ మధ్యాహ్నం విజయవాడలో  ఉపముఖ్యమంత్రి తీవ్రంగా  స్పందించారు. తన  కుమారుడి రాజకీయ ప్రవేశాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్ష పార్టీ ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడుతూ ఉందని, హత్యాారోపణలు చేస్తూ ఉందని ఆయన  విమర్శించారు. దీనిని ఎదుర్కోవడమెలా గో తెలుసని కూడా ఆయనే చెప్పారు.

 

కెఇ విలేకరుల సమ ావేశంలో చెప్పిన వివరాలు: 

 

హత్య చేసిందెవరో తెలియకుండానే అత్యుత్సహాంగా వైసీపీ నేతలు నాపై ఆరోపణలు చేస్తున్నారు.

కోట్ల, వైఎస్ వంటి వారు నన్ను అనేక ఇబ్బందులకు గురి చేసినా నేను ఏనాడూ హత్యా రాజకీయాలకు పాల్పడలేదు.

పోలీసు ఎంక్వైరీకి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుపడను.

ప్రజా బలంతో రాజకీయం చేసే సత్తా మాకుంది.

నాకు కానీ.. చంద్రబాబుకు కానీ హత్యలు చేయించాల్సిన అవసరం ఏముంటుంది.

వాస్తవాలన్నీ విచారణలో వెలుగులోకి వస్తాయి.

వచ్చే ఎన్నికల్లో మా అబ్బాయి పోటీ చేస్తున్నాడు కాబట్టే మా అబ్బాయిపై ఆరోపణలు.

రాజకీయంగా మా అబ్బాయి యాక్టీవ్ అయ్యారు.. అందుకే ఆరోపణలు.

జగనుది దింపుడు కళ్లెం ఆశ.

ప్రతి దాన్ని రాజకీయం చేస్తే తనకు ఉపయోగపడుతుందనే ఆశతో జగన్ ఉన్నారు.

భద్రత కల్పించే విషయం పోలీసు శాఖ పరిధిలోనిది.

కర్నూలు జిల్లాలో రాజకీయ హత్యలు ఎవరి హయాంలో జరిగాయో పోలీసు స్టేషన్లల్లో వివరాలు సేకరిస్తే వాస్తవాలు బయటకొస్తాయి.

PREV
click me!

Recommended Stories

YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu
Deputy CM Pawan Kalyan Speech: ఆరడుగుల బుల్లెట్ నేను కాదురఘురామ పై పవన్ పంచ్ లు | Asianet Telugu