ఎంఎల్ఏల రాజీనామాల బెదిరింపు....చంద్రబాబుకు షాక్

First Published May 22, 2017, 1:38 PM IST
Highlights

జిల్లాలోని మొత్తం 15 మంది శాసనసభ్యుల్లో 12 మంది ఎంఎల్ఏలు, ఇద్దరు ఎంఎల్సీలు తమకు గన్ మెన్ అవసరం లేదని తేల్చిచెప్పారు. జిల్లా ఎస్పీనే బదిలీ చేయాలని పట్టుబట్టారు. అంతేకాకుండా ఎస్పీ వైఖరికి నిరసనగా మూకుమ్మడి రాజీనామాకు సిద్ధపడ్డారు.

చంద్రబాబునాయుడుకే టిడిపి ఎంఎల్ఏలు షాక్ ఇస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఎంఎల్ఏలు రాజీనామాలకు సిద్ధపడటం పార్టీలో సంచలనంగా మారింది. తణుకు ఎంఎల్ఏ రాధాకృష్ణపై కేసు నమోదు చేయటం మిగిలిన ఎంఎల్ఏలు, ఎంఎల్సీలకు మండింది. అసలే, వివిధ కారణాలతో పలువురు ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు ఎస్పీ భరరత్ భూషణ్ పై మండుతున్నారు.

బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ఎస్పీ టిడిపి ఎంఎల్ఏల మాట వినటం లేదట. ఇసుక అక్రమ నిల్వలపై దాడులు చేయటం, బదిలీల్లో తమను ఖాతరు చేయటం లేదని ఇలా...వివిధ కారణాలతో ఎస్సీ అంటే ఎంఎల్ఏలకు పడటం లేదు. ఇపుడు అవకాశం వచ్చింది కాబట్టి ఎస్పీ వైఖరికి నిరసనగా తిరుగుబాటు చేస్తున్నట్లుగా మాట్లాడుతున్నారు.

ఐదు రోజుల క్రితం తణుకు ఎస్ఐ, రైటర్ ను రాధాకృష్ణ తన కార్యాలయానికి పిలిపించుకుని నిర్బంధించారు. పోలీసులను నిర్బంధించిన విషయం రాష్ట్రంలో సంచలనంగా మారింది. దానిపై పోలీసులు తర్జనభర్జన పడి చివరకు ఎంఎల్ఏ రాధాకృష్ణపై కేసు పెట్టారు. అక్కడే సమస్య మొదలైంది. అప్పటికే ఎస్పీపై మండిపోతున్న ఎంఎల్ఏలు రాధాకృష్ణపై కేసు నమోదు చేయటాన్ని అవకాశంగా తీసుకున్నారు.

ఆదివారం పార్టీ కార్యక్రమంపై జిల్లాకు వచ్చిన ఇన్ఛార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వద్ద పంచాయితీ పెట్టారు. రాధాకృష్ణపై కేసు ఎత్తేసేంత వరకూ తమ భద్రతా సిబ్బందిని వాపసు చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాలోని మొత్తం 15 మంది శాసనసభ్యుల్లో 12 మంది ఎంఎల్ఏలు, ఇద్దరు ఎంఎల్సీలు తమకు గన్ మెన్ అవసరం లేదని తేల్చిచెప్పారు. జిల్లా ఎస్పీనే బదిలీ చేయాలని పట్టుబట్టారు.   అంతేకాకుండా ఎస్పీ వైఖరికి నిరసనగా మూకుమ్మడి రాజీనామాకు సిద్ధపడ్డారు. చివరకు పార్టీ కార్యక్రమాన్ని జరగనీయకుండా అడ్డుకున్నారు.  

ఓ ఎంఎల్ఏ పోలీసులను తన కార్యాలయంలో బంధించటం మిగిలిన ఎంఎల్ఏలకి తప్పుగా అనిపించలేదు. పైగా రాధాకృష్ణ చేసింది సబబే అంటూ వత్తాసు పలకుతున్నారు. అంటే వారికి ప్రజాస్వామ్యంపై ఎంతటి గౌరవం ఉందో అర్ధమవుతోంది. ఇప్పటికే పోలీసులపై అధికారపార్టీ నేతలు బహిరంగంగానే దాడులుచేస్తున్నారు. దానికితోడు నిర్బంధించడాలు కూడా మొదలయ్యాయి.

ఎంఎల్ఏల వైఖరిని ప్రత్తిపాటి ముఖ్యమంత్రికి వివరించారు. సిఎం ఎంఎల్ఏల మండిపడ్డారు. ఈ రోజు పోలవరం ప్రాజెక్టు వద్దకు వస్తున్న తనను ఎవరూ కలవాల్సిన అవసరం లేదని చంద్రబాబు మంత్రి ద్వారా ఆదేశాలు పంపారు. చూడాలి ఏం జరుగుతుందో.

click me!