బాపట్ల బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.2కోట్ల బంగారం ఛోరీ... ఇంటిదొంగ అరెస్ట్

By Arun Kumar PFirst Published Sep 23, 2021, 11:45 AM IST
Highlights

బాపట్ల బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఖాతాదారులు తాకట్టు పెట్టిన దాదాపు రూ.2కోట్ల బంగారాన్ని ఛోరీ చేసిన ఇంటిదొంగ(బ్యాంక్ అటెండర్) ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ. 2.2 కోట్ల విలువ చేసే తాకట్టు బంగారం దొంగతనం ఇంటిదొంగ పనేనని పోలీసులు గుర్తించారు. బంగారాన్ని కాజేసిన బ్యాంక్ అటెండర్ సుమంత్ రాజు ఈ బంగారానని కొట్టేసినట్లు గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అతడి నుండి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.  

read more బాపట్లలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ. 2 కోట్ల విలువైన తాకట్టు బంగారం గల్లంతు

ఈ నెల 6వ తేదీన బాపట్ల పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ లో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం గల్లంతవడం కలకలం రేపింది. దాదాపు రూ.2కోట్ల విలువైన బంగారం బ్యాంకులో నుండి మాయం అవడంతో కంగారుపడిపోయిన మేనేజర్ పోలీసులకు పిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బయటవారు దొంగతనం చేసే అవకాశం లేదు కాబట్టి బ్యాంకులో పనిచేసే ఎంప్లాయీస్ నిర్వాకమే ఇదని అనుమానించిన పోలీసులు చివరకు ఇంటిదొంగ సుమంత్ ను అరెస్ట్ చేశారు. 
 

click me!