ఏయూలో అమెరికన్ కార్నర్ : ప్రారంభించిన ఏపీ సీఎం జగన్

By narsimha lodeFirst Published Sep 23, 2021, 11:45 AM IST
Highlights


 విశాఖ ఆంధ్రా యూనివర్శిటీలో అమెరికాన్ కార్నర్  ను  ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. అమెరికా కార్నర్ విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కల్గిస్తోందని ఆయన చెప్పారు. అహ్మదాబాద్,హైద్రాబాద్ తర్వాత విశాఖలోనే అమెరికా కార్నర్ ఏర్పాటైందని ఆయన గుర్తు చేశారు.
 

అమరావతి: ఏయూలో (andhra university) అమెరికన్ కార్నర్ (American Corner )ఏర్పాటు కావడం ఎంతో సంతోషకరమని ఏపీ సీఎం వైఎస్ జగన్ (Ys jagan)చెప్పారు.విశాఖపట్టణంలోని (visakhapatnam) ఏయూ కేంద్రంలో అమెరికన్ కార్నర్ కేంద్రాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ గురువారం నాడు ప్రారంభించారు. వర్చువల్ విధానంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు.

అహ్మదాబాద్, హైద్రాబాద్ తర్వాత విశాఖపట్టణంలోనే అమెరికన్ కార్నర్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.అమెరికన్ కాన్సులేట్ సహకారంతో అమెరికన్ కార్నర్ ఏర్పాటైంది.ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు.  అమెరికన్ కార్నర్  విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు.

యూఎస్ కాన్సులేట్ , ఆంధ్రా యూనివర్శిటీ మధ్య ఈ ఏడాది మార్చి 23న ఒప్పందం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఆంధ్రా యూనివర్శిటీ వైఎస్ ఛాన్సిలర్ పాల్గొన్నారు.అమెరికాలోని విభిన్న రంగాలకు చెందిన నిపుణులతో అమెరికన్ కార్నర్ కు వచ్చే విద్యార్ధులకు సూచనలు అందిస్తారు. బిజినెస్, సైన్స్ , టెక్నాలజీ, సామాజిక ఆర్ధిక, ఐటీ రంగాలకు చెందిన నిపుణులు, యూఎస్ లెజిస్లేటివ్ సభ్యులు ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చే విద్యార్ధులతో చర్చిస్తారు.

ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అగ్రరాజ్యంలో వస్తున్న మార్పుల గురించి తెలుపుతారు.  అమెరిన్‌ సంస్కృతి, సంప్రదాయాలు, అక్కడ ప్రవర్తన ఎలా ఉండాలనే అంశాలపైనా సూచనలు చేస్తారు.  అమెరికాలోని ప్రధాన యూనివర్సిటీల్లో విద్యార్థులు సీట్లు పొందాలంటే ఎలా ప్రిపేర్‌ కావాల్సిన అంశాలను నిపుణులు వివరించడంతోపాటు అందుకు అవసరమైన సమాచారాన్ని అమెరికన్ కార్నర్లో  పుస్తకాలు, ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌ ద్వారా తెలుసుకోవచ్చు.  భారత్‌ నుంచి అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులు, యువతకు వీసాకు ఎదురయ్యే చిక్కులు, వాటినుంచి బయటపడడం, కన్సల్టెంట్ల నుంచి మోసపోకుండా ఉండడం, వీసాకు ఎలా దరఖాస్తు చేసుకోవాలనే అంశాలను కూడా తెలుపుతారు.

click me!