సుమారు 12రోజుల అనంతరం ఆయన అజ్ఞాతం వీడారు. కుటుంబ సభ్యులను చూసేందుకు బుధవారం ఉదయం దుగ్గిరాలలోని తన నివాసానికి చేరుకోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఏలూరు: దెందులూరు మాజీ ఎమ్మెల్యే, వివాదాస్పద నేత చింతమనేని ప్రభాకర్ ను ఏలూరు కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. ఈనెల 25 వరకు రిమాండ్ విధించింది కోర్టు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో బుధవారం ఉదయం దుగ్గిరాలలోని ఆయన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చింతమనేని ప్రభాకర్ పై పినకడిమి గ్రామానికి చెందిన దళిత యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నేపథ్యంలో చింతమనేని ప్రభాకర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు.
ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడంతో తనను అరెస్ట్ చేస్తారని భావించిన చింతమనేని ప్రభాకర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సుమారు 12రోజుల అనంతరం ఆయన అజ్ఞాతం వీడారు. కుటుంబ సభ్యులను చూసేందుకు బుధవారం ఉదయం దుగ్గిరాలలోని తన నివాసానికి చేరుకోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అదుపులోకి తీసుకున్న పోలీసులు చింతమనేని ప్రభాకర్ ను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఆయనను అరెస్ట్ చేశారు. అనంతరం ఏలూరు కోర్టులో హాజరుపరిచారు.
ఇకపోతే పినకడిమి గ్రామానికి చెందిన దళిత యువకులపై దాడి ఘటనలో చింతమనేని ప్రభాకర్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులే కాకుండా చింతమనేనిపై 10 కేసులు సైతం ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
రెచ్చగొట్టారు, నాది తప్పని నిరూపిస్తే... బొత్సకు చింతమనేని సవాల్
అజ్ఞాతం వీడిన చింతమనేని: భార్యను చూసేందుకు వెళ్తుండగా అరెస్ట్
నేడు పోలీసుల ఎదుట లొంగిపోనున్న చింతమనేని ప్రభాకర్