పోర్టుబ్లెయిర్ వెళ్లాల్సిన విమానం విశాఖలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ప్రయాణికుల పడిగాపులు..

Published : Jun 26, 2023, 12:09 PM IST
పోర్టుబ్లెయిర్ వెళ్లాల్సిన  విమానం విశాఖలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ప్రయాణికుల పడిగాపులు..

సారాంశం

విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో ఎయిర్‌ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది.

విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో ఎయిర్‌ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. న్యూఢిల్లీ నుంచి పోర్టుబ్లెయిర్ బయలుదేరిన ఎయిర్‌ ఇండియా విమానం విశాఖపట్నంలో ఆదివారం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. పోర్టుబ్లెయిర్‌లో వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాన్ని విశాఖపట్నంకు మళ్లించారు. ఆ విమానంలో మొత్తం 270 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది.  వారందరికీ విశాఖపట్నంలోని ఓ హోటల్‌లో వసతి ఏర్పాటు చేశారు. అయితే విమానం పోర్టుబ్లెయిర్‌ ఎప్పుడూ బయలుదేరుతుందనే సమాచారం ఇవ్వడం లేదని  ప్రయాణికులు చెబుతున్నారు. 

అయితే విమానంలో ఎక్కువ మంది మెడికల్ కౌన్సిలింగ్‌కు వెళ్లాల్సిన వారు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే విమానం పోర్టుబ్లెయిర్‌కు ఎప్పుడూ బయలుదేరుతుందనే దానిపై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?