జేసీ దివాకర్ రెడ్డికి హైకోర్టులో ఊరట..

By telugu teamFirst Published Nov 27, 2019, 10:49 AM IST
Highlights

 తానెంత ఖర్చు చేశానో మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మీడియా ముందు చెప్పారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని అనంతపురంలో సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసిన దేవరగుడి జగదీశ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. 


మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఊరట లభించింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో... తమ కుమారుడి కోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టానంటూ జేసీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఆయనపై కేసు నమోదైంది. కాగా... ఆ కేసును ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.

ఎన్నికల వ్యయంపై చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఎవరిపైనా చర్యలు తీసుకోలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. తానెంత ఖర్చు చేశానో మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మీడియా ముందు చెప్పారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని అనంతపురంలో సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసిన దేవరగుడి జగదీశ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం జస్టిస్‌ సంజీవ్‌ సచ్‌దేవా విచారణ చేపట్టారు. 

AlsoRead మంటల్లో చిక్కుకున్న కావేరి ట్రావెల్స్ బస్సు... రూ.20లక్షల నగదు బూడిదపాలు...

జేసీ తన వ్యాఖ్యలను సరిదిద్దుకున్న నేపథ్యంలో చర్యలకు ఆదేశించలేమని స్పష్టం చేశారు. డబ్బు ద్వారా తమను ప్రభావితం చేస్తున్నారని ప్రజలు ఫిర్యాదు చేయకుండా తాము చర్యలు తీసుకోలేమని, ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని నివారించడానికి పౌరులే ముందుకురావాలని తెలిపారు. పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని పిటిషనర్‌కు సూచించారు. తాను సుప్రీంకోర్టుకు వెళ్తానని ఆయన చెప్పడంతో న్యాయమూర్తి పిటిషన్‌ను కొట్టివేశారు

click me!