చదవుకోనివ్వకుండా పెళ్లి చేసేస్తారని.. మనస్తాపంతో యువతి ఆత్మహత్య..

Published : Oct 15, 2022, 06:39 AM IST
చదవుకోనివ్వకుండా పెళ్లి  చేసేస్తారని.. మనస్తాపంతో యువతి ఆత్మహత్య..

సారాంశం

డిగ్రీ చదువుతున్న విద్యార్థినికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలో చోటు చేసుకుంది. 

లేపాక్షి : చదువుపై మమకారంతో ఉన్న ఓ యువతికి ఇంట్లో వాళ్లు పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో మనస్థాపానికి గురి అయింది.  అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. లేపాక్షి మండలం పులమతికి చెందిన నాగప్ప కుమార్తె పునీత (19) హిందూపురంలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. 

ఈ క్రమంలో తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తను ఇంకా చదువుకోవాలని అంతవరకు పెళ్లి చేసుకోను అని ఆమె చెప్పింది. ఆమె మాటలు పట్టించుకోకుండా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. దాంతో మనస్తాపం చెందిన పునీత శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.  తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఒంగోలు శివార్లలో గ్యాంగ్ రేప్..బండి మీద వెడుతున్న మహిళను వెంబడించి..వాహనంతో ఢీ కొట్టి..

కాగా, పట్టణంలోని లక్ష్మీ నగర్ లో ఉన్న బండ గుంత నీటిలో పడి అశ్వర్థమ్మ అనే వృద్ధురాలు శుక్రవారం మృతి చెందింది. స్థానిక టీచర్స్ కాలనీకి చెందిన ఆమె గురువారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో.. కుటుంబ సభ్యులు అన్నిచోట్లా గాలించారు. బండ గుంత నీటిలో వృద్ధురాలి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.  

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీయించారు. అశ్వర్థమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోందని, ఆరోగ్యం కుదుట పడకపోవడంతో నీటిలో పడి ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం  చేయించారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?