కాళ్లు పట్టుకుంటే వినలేదని.. గొంతు పిసికి చంపేశాడు, ఆయన హీరో కాదు విలన్ : చంద్రబాబుపై అంబటి సెటైర్లు

Siva Kodati |  
Published : Oct 14, 2022, 09:06 PM IST
కాళ్లు పట్టుకుంటే వినలేదని.. గొంతు పిసికి చంపేశాడు, ఆయన హీరో కాదు విలన్ : చంద్రబాబుపై అంబటి సెటైర్లు

సారాంశం

1995లో టీడీపీలో చోటు చేసుకున్న సంక్షోభంపై టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై సెటైర్లు వేశారు మంత్రి అంబటి రాంబాబు. కాళ్లు పట్టుకుంటే వినలేదని.. గొంతు పిసికి చంపేశాడని అంబటి ట్వీట్ చేశారు. 

టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై సెటైర్లు వేశారు మంత్రి అంబటి రాంబాబు. ఆహా ఓటీటీలో ప్రసారమైన అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ 1లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 1995 నాటి టీడీపీలో తిరుగుబాటు అంశంపై ఆయన మాట్లాడారు. దీనిపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ‘‘కాళ్ళు పట్టుకుని అడుక్కున్నాడు . తన మాట వినమని! వినల ! గొంతు పిసికి చంపేశాడు!!  అతన్ని విలన్ అంటారా? హీరో అంటారా ? ’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. 

ఇకపోతే.. `అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే2` షో అక్టోబర్‌ 14 నుంచి ఇది ప్రసారమవుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో బాలయ్య, చంద్రబాబు మధ్య సంచలనాత్మక విషయాలపై చర్చ జరగడం విశేషం. చంద్రబాబు లైఫ్‌లో అతి పెద్ద నిర్ణయం ఏంటనేది బాలయ్య ప్రశ్నించగా `1995 నిర్ణయం` అని చంద్రబాబు తెలిపారు. ఒక వ్యక్తిగా మిమ్మల్ని నేను అడుగుతున్నా. ఆ రోజు మనం తీసుకున్న నిర్ణయం తప్పా?.. అని చంద్రబాబు ప్రశ్నించగా, ఆ రోజు నాకు బాగా గుర్తుంది అని బాలయ్య చెప్పారు. 

Also REad:చట్టాన్ని అతిక్రమిస్తే వాళ్ల గుండెల్లో నిద్రపోతా.. ఎవ్వరినీ వదిలే ప్రసక్తి లేదు.. చంద్రబాబు నాయుడు

`ఆయన్ని కాళ్లు పట్టకుని అడుకున్నా నా మాట వినండి అని, కానీ వినలేదని, ఇక వేస్ట్.. ` అని తాను ఆ నిర్ణయం తీసుకున్నట్టు చంద్రబాబు చెప్పారు. బయట నుంచి వచ్చిన వారి ప్రభావం పెద్దాయన మీద ఎక్కువగా వుందని చంద్రబాబు తెలిపారు. నాడు రామ బాట కోసం ఆంజనేయుడు చేసిన విధంగానే తాము చేస్తున్నామని టీడీపీ చీఫ్ చెప్పారు. దీనిపై స్పందించిన బాలకృష్ణ.. చంద్రబాబు ఆనాడు చేసింది తప్పయితే 1999 ఎన్నికల్లో గెలిచేవారు కారని అన్నారు. మొత్తం మీద 1995లో అధికార మార్పిడి నిర్ణయం.. నారా, నందమూరి కుటుంబాలు, టీడీపీ నేతలు తీసుకున్న నిర్ణయంగా బాలయ్య చెప్పుకొచ్చారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vijaysai Reddy Sensational Comments On YS Jagan | Asianet News Telugu
Annadata Sukhibhava: రైతుల‌కు ద‌స‌రా కానుక‌.. ఖాతాల్లోకి రూ. 6000 జ‌మ‌, ఎప్పుడంటే.?