ఫిరాయింపు ఎంఎల్ఏకు షాక్

First Published Jan 4, 2018, 3:53 PM IST
Highlights
  • ఫిరాయింపు ఎంఎల్ఏలకు టిడిపిలో షాకులు మొదలయ్యాయి

ఫిరాయింపు ఎంఎల్ఏలకు టిడిపిలో షాకులు మొదలయ్యాయి. అవసరార్ధం అప్నట్లో చంద్రబాబునాయుడు వైసిపి ఎంఎల్ఏలకు ఎన్నో హామీలిచ్చారు. తీరా ఫిరాయించిన తర్వాత ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. చాలామంది ఫిరాయింపులకు టిడిపిలో పనులు కావటం లేదు. మరికొందరికి అసలు చంద్రబాబు అపాయిట్మెంటే దొరకటం లేదు. ఇంకొదరిని టిడిపి క్యాడర్ దగ్గరకు రానీయటం లేదు. సరే, కొందరిపై కోడిగుడ్లతో దాడులు కూడా చేస్తున్నారనుకోండి అది వేరే సంగతి.

ఇంతకీ ప్రస్తుత విషయం ఏమిటంటే, కృష్ణా జిల్లాలోని పామర్రు ఎంఎల్ఏ ఉప్పులేటి కల్పనకు ఇబ్బందులు మొదలయ్యాయి. వచ్చే ఎన్నికల్లో టికెట్టు దక్కేది అనుమానమే అంటున్నారు. ఎందుకంటే, కల్పనకు పోటీగా చంద్రబాబు మరో నేతను తీసుకొస్తున్నారు. కాంగ్రెస్ కు చెందిన డివై దాస్ అనే మాజీ ఎంఎల్ఏ టిడిపిలో చేరేందుకు ముహూర్తం చూసుకుంటున్నారు. చంద్రబాబును కలిసి మాట్లాడుకోవటం అన్నీ అయిపోయాయని పార్టీ వర్గాల సమాచారం.

ఇంతకీ డివై దాస్ టిడిపిలో ఎందుకు చేరుతున్నారు? ఇంకెందుకు? వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకే అని పార్టీ వర్గాలంటున్నాయి. మరి, కల్పన పరిస్ధితేంటి? టిడిపి నేత వర్ల రామయ్య భవిష్యత్తేంటి? అంటే వారిద్దరి సంగతి తెలీదుగానీ దాస్ కు మాత్రం చంద్రబాబు టిక్కెట్టు హామీ ఇచ్చారని అంటున్నారు. ఎప్పుడైతే దాస్ టిడిపిలో చేరుతున్న విషయం బయటకు పొక్కిందో అప్పటి నుండి కల్పన గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయట.

చంద్రబాబును కలిసి పార్టీ ఫిరాయించేటపుడు తనకు ఇచ్చిన హామీల విషయం ప్రస్తావించాలని అనుకున్నారట. అయితే, చంద్రబాబు అపాయిట్మెంట్ దొరకటం లేదు. దాంతో ఏం చేయాలో కల్పనకు దిక్కుతోచటం లేదు.

అసలు, ఇదే డివై దాస్ వైసిపిలో చేరుదామనుకుని ప్రయత్నాలు చేసుకున్నారు. కానీ జగన్ అంగీకరించలేదు. ఎందుకంటే, కల్పన టిడిపిలోకి జంప్ చేసిన తర్వాత పామర్రు నియోజకవర్గ ఇన్చార్జిగా జగన్ అనిల్ కుమార్ ను నియమించారు. ఇపుడు దాస్ ను పార్టీలోకి చేర్చుకుంటే ఇద్దరి మధ్య సమస్యలు మొదలై చివరకు పార్టీ దెబ్బతింటుందని ఆలోచించారట. అందుకనే దాస్ కు నో చెప్పారట. దాంతో దాస్ వెంటనే చంద్రబాబును కలిసి హామీ తీసుకున్నారట. నియోజకవర్గంలో దాస్ పేరుతో టిడిపి ఫ్లెక్సీలు, బ్యానర్లు కనబడటంతో కల్పనకు భవిష్యత్ కళ్ళ ముందు తిరుగుతోందట.

 

 

 

 

 

 

click me!