
పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆంధ్రప్రదేశ్ ను నగదు రహిత రాష్ట్రంగా మార్చేందుకు చేపట్టిన మొదటి ప్రయత్నం ఏపీ పర్స్. దీనికి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం మీడియాకు వెల్లడించారు.
ఏపీ పర్స్ అనే ఈ మొబైల్ యాప్ ద్వారా బ్యాంకు సేవలన్నీ వినియోగించుకోవచ్చని సీఎం వెల్లడించారు. ఏపీ పర్స్ ఆన్ చేయగానే 23 సంస్థలు కనిపిస్తాయని తెలిపారు.
23 సంస్థల్లో దేన్నైనా ఎన్నుకుని సేవలు వినియోగించుకోవచ్చని సూచించారు.
నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహానికి ఏపీ పర్స్ మొబైల్ వ్యాలెట్‌ను రూపొందించిన్నట్లు వెల్లడించారు.
మొబైల్ వ్యాలెట్ ద్వారా విడతల వారీగా నగదు బదిలీ చేసుకోవచ్చన్నారు.
వారంలో 7 సార్లు లావాదేవీలు చేస్తే రూ.5 చొప్పున 20 రూపాయలు ఇస్తామని తెలిపారు. మొత్తం ప్రక్రియను 4 కేటగిరీలుగా విభజించామని వెల్లడించారు.