దంపతులను బురిడీ కొట్టించి... భారీ నగదు చోరీ

Arun Kumar P   | Asianet News
Published : Dec 18, 2020, 09:23 AM IST
దంపతులను బురిడీ కొట్టించి... భారీ నగదు చోరీ

సారాంశం

దంపతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారివద్ద గల భారీ నగదు దోచుకున్నారు దోపిడీ దొంగలు. 

విజయనగరం: బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద దొంగలు చేతివాటం చూపించారు. ఓ ప్రయాణికుడు బురిడీ కొట్టించి భారీ చోరీకి పాల్పడ్డారు. ప్రయాణికుడి బ్యాగు నుంచి రూ.5 లక్షల రూపాయలను చాకచక్యంగా కొట్టేశారు దుండగులు. 

భార్యతో కలిసి బొబ్బిలి నుంచి అమలాపురం వెళ్తున్నాడు కొబ్బరికాయలు వ్యాపారి శ్రీనివాసరావు.  అమలాపురంలోని కొబ్బరికాయల వ్యాపారికి బకాయి చెల్లించడానికి రూ.5లక్షలు ఓ బ్యాగులో తీసుకెళుతున్నారు. ఈ విషయాన్ని దోపిడీ దొంగలు ముఠా గుర్తించింది. దీంతో అత్యంత చాకచక్యంగా దంపతుల ద్రుష్టి మళ్లించి మొత్తం సొమ్మును దోచుకున్నారు. 

కష్టపడి సంపాదించిన భారీ నగదు దొంగతనానికి గురవడంతో బాధిత భార్యాభర్తలు లబోదిబమంటున్నారు. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆర్టీసి కాంప్లెక్స్ సమీపంలోని సిసి కెమెరా పుటేజీని పరిశీలిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్