( వీడియో) విజయవాడలో పట్టపగలే హత్య

Published : Mar 13, 2017, 12:48 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
( వీడియో) విజయవాడలో పట్టపగలే హత్య

సారాంశం

కొడుకు మృతి, తల్లి పరిస్థితి విషమం

తల్లీకొడుకుపై వేటకొడవలితో విరుచకపడ్డాడు విజయవాడలోని ఓ రౌడీషటీర్. పండ్ల మార్కెట్ లో పనిచేసే పద్మ, ఆమె కుమారుడు నరేంద్ర సోమవారం బైక్‌పై వెళ్తుండగా శంకర్ అనే వ్యక్తి వేటకొడవలితో వచ్చి వారిపై దాడికి దిగాడు.

 

పట్టపగలే అందరూ చూస్తుండగా ఈ దారుణానికి ఒడిగట్టాడు. అక్కడున్న సీసీ టీవీలో హత్యాయత్నం దృష్యాలు రికార్డు అయ్యాయి. ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని శంకర్ గా పోలీసులు గుర్తించారు. దాడిలో కుమారుడు మృతి చెందగా తల్లి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం స్థానిక ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు.

కాగా, నిందితుడు శంకర్ గా గతంలో పద్మ  సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిసింది. ఇటీవల వీరిమధ్య మనస్పర్ధలు వచ్చాయని అవే  ఈ హత్యాకు దారి తీసిఉంటాయని  భావిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

సచివాలయం ఉద్యోగులు VS పోలీస్ లు విజయవాడ ధర్నా చౌక్ వద్ద హై టెన్షన్ | Secretariat Employees Dharna
Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజులు దంచికొట్టనున్న వానలు