భూమాకి ముఖ్యమంత్రి వినూత్న నివాళి

Published : Mar 13, 2017, 06:24 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
భూమాకి ముఖ్యమంత్రి  వినూత్న నివాళి

సారాంశం

భూమా కోరినట్లు నంద్యాల ప్రాంతాన్ని అభివృద్ధి  చేసేందుకు  అధికారులకు  ఆదేశాలు

 

ఆళ్లగడ్డ, నంద్యాల నియోజక వర్గాలలో రోడ్లు, మంచినీరు, సాగునీరు సమస్యలని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు  నాయుడు  మంత్రులను అధికారులను ఆదేశించారు.

 

ఇది ఆయనకు నివాళి అని ఆయన అభిప్రాయపడుతున్నారు.

 

అటూవైపు నిన్న హఠాత్తుగా మరణించిన  నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి తుది వీడ్కోలు చెప్పేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఆళ్లగడ్డ వస్తున్నపుడు ముఖ్యమంత్రి   ఈ రెండు నియోజకవర్గాల గురించి సుమారు అరగంట సేపు టెలికాన్ఫరెన్స్ లో చర్చించారు.

 

భూమా నాగిరెడ్డి తనతోె భేటీ అయినప్పుడు పలుమార్లు ఈ సమస్యలు తన దృష్టి తెచ్చేవారని కూడా ఆయన చెప్పారు. 

 

ఆయన ఇలా హఠాత్తుగా మరణించడంతో నివాళిగా ఈ రెండు నియోజకవర్గాల ప్రజా సమస్యలను తీర్చేందుకు చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారని ఒక అధికారిచెప్పారు.

 

నియోజక వర్గాలకు కేటాయించిన నిధులు పూర్తిగా వినియోగించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?