విచిత్రం.. కరోనా వస్తుందని భయం.. నాలుగేళ్లుగా ఇంట్లోని వేర్వేరు గదుల్లోనే తల్లీ కూతుళ్లు..

By SumaBala BukkaFirst Published Dec 20, 2022, 1:53 PM IST
Highlights

కరోనా భయంతో నాలుగేళ్లుగా  ఓ తల్లీ కూతుళ్లు ఇంట్లోనే ఉంటున్నారు. ఒకరినొకరు కూడా చూసుకోవడంలేదు. గత వారం రోజులుగా తండ్రిని కూడా ఇంట్లోకి రానివ్వడం లేదు. 

కాకినాడ : ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లాలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. కాజులూరు మండలం కుయ్యరు గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. ఓ తల్లీకూతుళ్లు విచిత్రంగా నాలుగు సంవత్సరాల నుంచి ఇంట్లోంచి బయటికి రాలేదు. కరోనా సమయంలో మొదలైన వీరి అలవాటు ఇప్పటికీ కొనసాగుతోంది. కరోనా లాక్ డౌన్ సమయంలో ఇంట్లోనుంచి బైటికి రావద్దని పెట్టిన నిబంధనతో వీరు భయాన్ని పెట్టుకున్నారు. దీంతో వీరిద్దరూ అప్పటినుంచి ఇప్పటివరకు దాదాపు 4యేళ్లు ఇంటికే పరిమితమయ్యారు. 

తల్లి పేరు మణి, కూతురు దుర్గాభవాని. వీరిద్దరూ ఇంట్లో ఒక హాల్ కు పరిమితం అయ్యారు. హాల్ లోనూ కూర్చుండిపోయారు. తండ్రే వీరికి అప్పుడప్పుడు ఆహారం తెచ్చిచ్చేవాడు. ఇంట్లోనుంచి బైటికివస్తే కరోనా వస్తుందేమో అనే భయంతో వారిని వణికిస్తుంది. దీంతో హాల్ లో కూర్చుని దుప్పటి కప్పుకుని.. దాని లోపలే ఉండిపోతున్నారు. ఎవరైనా బైటినుంచి మాట్లాడించినా దుప్పట్లోనుంచే సమాధానం చెబుతున్నారు. 

విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టిన చింతలపూడి ఎమ్మెల్యే కారు: ఎలీజా సహా కుటుంబ సభ్యులు క్షేమం

అది కూడా కిటికీ బయటినుంచి అడిగితేనే. ఈ విషయం ఇటీవల బయటపడింది. దీంతో వైద్యసిబ్బంది వారి ఇంటికి చేరుకున్నారు. ఇంట్లోనుంచి తల్లీకూతుళ్లను బైటికి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. అయితే, తల్లీ కూతురు కూడా ఒకే గదిలో ఉండడం లేదు. ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో ఉంటున్నారు. తల్లి.. కూతుర్ని చూసి రెండేళ్లు అవుతోందట. ఇక తండ్రిని కూడా వారం రోజులనుంచి ఇంట్లోకి రానివ్వడంలేదు.. దీంతో విషయం ఇలా వెలుగులోకి వచ్చింది. ఇటీవల తల్లి ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఇంటికొచ్చిన ఆస్పత్రి సిబ్బంది వారిని బైటికి తీసుకురావడానికి ప్రయత్నించగా..దానికి వారు ఒప్పుకోలేదు. 

click me!