వివేకా హత్య కేసు.. భూమి సహా, కోరినంత డబ్బు ఇస్తామన్నారు: భరత్ యాదవ్‌పై సీబీఐకి దస్తగిరి ఫిర్యాదు

Siva Kodati |  
Published : Feb 22, 2022, 05:21 PM IST
వివేకా హత్య కేసు.. భూమి సహా, కోరినంత డబ్బు ఇస్తామన్నారు: భరత్ యాదవ్‌పై సీబీఐకి దస్తగిరి ఫిర్యాదు

సారాంశం

ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (ys viveka case)  హత్య కేసులో సీబీఐకి (cbi) ఫిర్యాదు చేశాడు దస్తగిరి. భరత్‌తో పాటు దేవిరెడ్డి లాయర్ ఓబుల్ రెడ్డి కూడా వచ్చాడని తెలిపాడు. తనకు భూమి ఇస్తాం .. ఎంత డబ్బు కావాలో చెప్పాలని తనను అడిగారని వ్రాతపూర్వకంగా ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు దస్తగిరి.   

ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (ys viveka case)  హత్య కేసులో సీబీఐకి (cbi) ఫిర్యాదు చేశాడు దస్తగిరి. అప్రూవర్‌గా మారిన తర్వాత తనను భరత్ యాదవ్ కలిశాడని.. ఫోన్‌లో హెలిప్యాడ్ దగ్గరకు రమ్మన్నాడని పేర్కొన్నాడు. భరత్‌తో పాటు దేవిరెడ్డి లాయర్ ఓబుల్ రెడ్డి కూడా వచ్చాడని తెలిపాడు. తనకు భూమి ఇస్తాం .. ఎంత డబ్బు కావాలో చెప్పాలని తనను అడిగారని వ్రాతపూర్వకంగా ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు దస్తగిరి. 

మరోవైపు వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరిని సోమవారం సీబీఐ అధికారులు పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. మరోసారి దస్తగిరి వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు నమోదు చేశారు. అప్రూవర్​గా మారిన అతని చేత.. మెజిస్ట్రేట్ ముందు సెక్షన్ 164 కింద వాంగ్మూలం నమోదు చేయించారు. వివేకానందరెడ్డి మాజీ డ్రైవర్‌గా ఉన్న దస్తగిరి ఈ కేసులో అప్రూవర్‌గా మారిన సంగతి తెలిసిందే. గతేడాది నవంబర్ 26న దస్తగిరి అప్రూవర్‌గా మారరేందుకు కడప కోర్టు (Kadapa Court) అనుమతిచ్చింది. గతేడాది ఆగస్ట్‌ 31న ప్రొద్దుటూరు కోర్టులో దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. 

ఇకపోతే.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డిల పిటిషన్లను ఇటీవల హైకోర్టు కొట్టేసింది. దస్తగిరి అప్రూవర్‌గా మారేందుకు అనుమతిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. అప్రూవర్ గా మారుతున్నట్టు దస్తగిరి ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డిలు వేసిన పిటిషన్‌లను హైకోర్టు కొట్టివేసింది.  దస్తగిరికి క్షమాభిక్ష ప్రసాదించడంలో సీబీఐ దురుద్దేశంతో వ్యవహరించిందన్న పిటిషనర్ల తరఫు వాదనలను తోసిపుచ్చింది. దస్తగిరికి క్షమాభిక్ష ప్రసాదిస్తూ మెజిస్ట్రేట్‌ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ఖరారు చేసింది. చట్టప్రకారం సీబీఐ ముందుకెళ్లొచ్చని తెలిపింది. 

వివేకా హత్యకు సంబంధించిన సంచలన విషయాలను గతేడాది దస్తగిరి సిబిఐ అధికారులకు  ఓ వాంగ్మూలం ఇచ్చాడు. ఇందులో వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేస్తే ఎర్ర గంగిరెడ్డి రూ. 40 కోట్లు ఇస్తాడని Umashankar Reddy   తనకు చెప్పినట్టు దస్తగిరి పేర్కొన్నాడు. అంతేకాదు హత్య జరిగిన తర్వాత తనతో సహా కొంతమందిమి శంకర్ రెడ్డి ఇంటికి వెళ్లినట్లు అప్పుడు కూడా తమకేమీ సమస్య రాకుండా ఎర్ర గంగిరెడ్డి చూసుకుంటారని శంకర్ రెడ్డి హామీ ఇచ్చారని దస్తగిరి పేర్కొన్నాడు. 

ఎర్ర గంగిరెడ్డి, Sunil Yadav, గుజ్జుల ఉమాశంకర్‌రెడ్డితో కలిసి వివేకాను హత్య చేసినట్టు దస్తగిరి  సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. బెంగళూరు ల్యాండ్ వివాదంలో వాటా ఇవ్వకపోవడంపై ఆగ్రహంతో ఎర్ర గంగిరెడ్డి పగ పెంచుకున్నారని చెప్పారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గంగిరెడ్డి మోసం చేశారని మీ సంగతి తేలుస్తానంటూ గంగిరెడ్డి, అవినాష్‌లకు వివేకా వార్నింగ్‌ ఇచ్చినట్టు దస్తగిరి ఆ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. 

MLC ఎన్నికల్లో ఓటమి తర్వాత అవినాష్‌ ఇంటి దగ్గర వాగ్వాదం జరిగిందని స్టేట్‌మెంట్‌లో తెలిపారు. తనను కావాలనే ఓడించారని, మీ కథ తేలుస్తానంటూ అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, డి.శంకర్‌రెడ్డిలకు వివేకా వార్నింగ్‌ ఇచ్చినట్లు దస్తగిరి  ఆ వాంగ్మూలంలో పేర్కొన్నారు. సీఆర్‌పీసీ 164(1) సెక్షన్ కింద ప్రొద్దుటూరు కోర్టులో స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. హత్యలో నలుగురు పాల్గొన్నట్టు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో ఉంది. ఎర్ర గంగిరెడ్డి  , సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్‌రెడ్డితో కలిసి వివేకాను హత్య చేసినట్టు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.

PREV
click me!

Recommended Stories

Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu
CM Chandrababu at Naravaripalli నారావారి పల్లి లో గోమాతకి పూజ చేసిన సీఎం చంద్రబాబు| Asianet Telugu