టీటీడీ బోర్డులో నేర చరిత్ర ఉన్న వారి నియామకం.. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి ఊరట

By Siva KodatiFirst Published Feb 22, 2022, 4:06 PM IST
Highlights

టిటిడి బోర్డు (ttd borad) సభ్యులలో క్రిమినల్ కేసులు నమోదైన వున్నారని,  ప్రత్యేక ఆహ్వానితులు ఎక్కువ మంది ఉన్నారని వేసిన పిటీషన్‌పై ఏపీ హైకోర్టులో (ap high court) మంగళవారం విచారణ జరిగింది. జీవోపై హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి (bhumana karunakar reddy) ఇంప్లీడ్ పిటిషన్ వేయడంతో ఆయనకు మాత్రమే ప్రత్యేక ఆహ్వానితునిగా వుండేందుకు అనుమతి ఇచ్చింది ధర్మాసనం.

టిటిడి బోర్డు (ttd borad) సభ్యులలో క్రిమినల్ కేసులు నమోదైన వున్నారని,  ప్రత్యేక ఆహ్వానితులు ఎక్కువ మంది ఉన్నారని వేసిన పిటీషన్‌పై ఏపీ హైకోర్టులో (ap high court) మంగళవారం విచారణ జరిగింది. టిటిడి బోర్డు మెంబర్లు 18 మందిలో ఇద్దరు మాత్రమే కౌంటర్ దాఖలు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మిగిలిన వారిని కూడా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయకుంటే విచారణ కొనసాగిస్తామని స్పష్టం చేసింది న్యాయస్థానం. 

ప్రతేక ఆహ్వానితులపై ఇచ్చిన జివోపై హైకోర్టు స్టే ఇచ్చినందున, ఆర్టినెన్స్ తెచ్చామని ప్రభుత్వ తరుపు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. అయితే ఆర్డినెన్స్ తెచ్చిన తరువాత జీవో ఇవ్వనందునున ఆర్డినెన్స్ చెల్లదని పిటీషనర్ తరుపు న్యాయవాది వాదించారు. ఆర్డినెన్స్‌ పై ప్రత్యేకంగా పిటిషన్ వేయమని పిటీషనర్‌కు సూచించింది ధర్మాసనం. జీవోపై హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి (bhumana karunakar reddy) ఇంప్లీడ్ పిటిషన్ వేయడంతో ఆయనకు మాత్రమే ప్రత్యేక ఆహ్వానితునిగా వుండేందుకు అనుమతి ఇచ్చింది ధర్మాసనం.
 
భూమన కరుణాకరెడ్డి వేసిన ఇంప్లీడ్ పిటీషన్‌ను విచారణకు అనుమతించవద్దని ధర్మాసనాన్ని కోరారు పిటీషనర్ తరుపు న్యాయవాది. భూమన తన ప్రయోజనం కోసమే ఇంప్లీడ్ పిటీషన్ వేశారని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం వేసిన  మెమో కాపీ తమకు అందలేదని, అందిన తరువాత కౌంటర్ దాఖలు చేస్తామని ఈ లోగా స్టే వెకేట్ చేయవద్దని ధర్మాసనాన్ని కోరారు పిటీషనర్ తరుపు న్యాయవాది. అయితే మెమో కాపీ మీరే అడిగి తీసువాలని వ్యాఖానించింది హైకోర్టు. తదుపరి విచారణను మార్చి 11వ తేదికి వాయిదా వేసింది ధర్మాసనం.

Latest Videos

ఇకపోతే, టీటీడీ నూతన బోర్డును నియమకానికి సంబంధించి గతేడాది రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరుగా జీవోలు జారీచేసిన సంగతి తెలిసిందే. టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి రెండో సారి అవకాశం కల్పించిన జగన్ సర్కార్.. ఎక్స్‌అఫీషియో సభ్యులుగా నలుగురు అధికారులతో పాటు 24 మందిని సభ్యులుగా నియమించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సుధాకర్‌కు అవకాశం కల్పించారు. వీరికి తోడు గతంలో ఎప్పుడూ లేనంతగా 50 మంది ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు.

టీటీడీకి జంబో పాలకవర్గం ఏర్పాటు చేయడాన్ని టీడీపీ సహా పలు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. జగన్ సర్కార్ తీరుపై విమర్శలు గుప్పించాయి. ఈ జీవోలను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారించిన ఏపీ హైకోర్టు ప్రత్యేక ఆహ్వానితులకు సంబంధించిన జీవోను సస్పెండ్ చేసింది. మరోవైపు టీటీడీ బోర్డు సభ్యుల నియామకంలో నేర చరిత్ర ఉన్నవారిని నియమించారంటూ గత కొద్ది రోజులుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

click me!